Bahubali: రాజమౌళి దారిలో సుకుమార్.. ‘పుష్ప’ను కలిపేస్తారా?
ప్రభాస్‌కి సంబంధించి ‘సలార్’ (Salar) కూడా సెకండ్ పార్ట్ సిద్ధమవుతోంది. అలాగే ‘కల్కి 2’ (Kalki 2). ఈ సినిమాలన్నీ కూడా రాజమౌళి మాదిరిగానే రెండు లేదంటే మూడు పార్టులుగా తీసి మొత్తాన్ని కలిపి వదులుతారా? చూడాలి.
టాలీవుడ్ (Tollywood)లో ట్రెండ్ సెట్ చేయాలంటే రాజమౌళి (Rajamouli)యే.. ఆయన తర్వాతే ఎవరైనా.. బాహుబలి (Bahubali)తో ఓ ట్రెండ్ సెట్ చేశారు. అక్కడి నుంచే పాన్ ఇండియా (Pan India) చరిత్ర టాలీవుడ్‌లో మొదలైంది. అలాగే ఒక కథను రెండు భాగాలుగా చూపించే ట్రెండ్‌కు కూడా శ్రీకారం చుట్టింది రాజమౌళియే అనడంలో సందేహం లేదు. ఇక ఇప్పుడు మరో ట్రెండ్. ‘బాహుబలి: ది బిగినింగ్’ (Bahubali: The Biginning), ‘బాహుబలి: ది కన్‌క్లూజన్’ (Bahubali: The Conclusion) రెండింటినీ కలిపి తాజాగా ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి మరో కొత్త ట్రెండ్‌కు రాజమౌళి శ్రీకారం చుట్టారు. బాహుబలి: ది ఎపిక్ ఎలా ఉంది?(Baahubali: The Epic Review) పేరిట ఒకే టికెట్‌పై రెండు సినిమాలను చూసిన అనుభూతిని రాజమౌళి పంచడంలో సక్సెస్ అయ్యారు.
రాజమౌళి ఎప్పటికప్పుడు ఏదో ఒక ట్రెండ్ సెట్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు నయా ట్రెండ్. మొత్తానికి రాజమౌళి ట్రెండ్ అయితే సెట్ చేశారు. మరి దీనిని ఎంతమంది ఫాలో అవుతారనేది చూడాలి. త్వరలోనే ‘పుష్ప’ (Pushpa)ను సైతం రెండు పార్టులు కలిపే అవకాశం లేకపోలేదు. లేదంటే పార్ట్ 3 కూడా పూర్తయ్యాక మూడు పార్టులను కలిపి దర్శకుడు సుకుమార్ (Sukumar) వదులుతారో చూడాలి. ప్రభాస్‌కి సంబంధించి ‘సలార్’ (Salar) కూడా సెకండ్ పార్ట్ సిద్ధమవుతోంది. అలాగే ‘కల్కి 2’ (Kalki 2). ఈ సినిమాలన్నీ కూడా రాజమౌళి మాదిరిగానే రెండు లేదంటే మూడు పార్టులుగా తీసి మొత్తాన్ని కలిపి వదులుతారా? చూడాలి. మరోవైపు కోలీవుడ్ సినిమాటిక్ యూనివర్స్ (Cinematic Universe) ట్రెండ్ నడుస్తోంది. ఇంకా మన తెలుగు దర్శకులకు అది వంట బట్టినట్టు లేదు.
అది కూడా టాలీవుడ్‌లో మొదలు పెడితే సినిమాలు మరింత ఇంట్రస్టింగ్‌గా మారుతాయనడంలో సందేహం లేదు. మొత్తానికి రాజమౌళి అయితే ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్నారు. మరి ఈ ట్రెండ్‌ను సౌత్ ఇండియా సినిమాలన్నీ (South Indian Movies) ఫాలో అవుతాయేమో చూడాలి. ఏది వచ్చినా.. రాకున్నా కన్నడ ప్రేక్షకులు అయితే తప్పనిసరిగా ‘కేజీఎఫ్’ (KGF) రెండు పార్టులను కలిపి వదిలితే చూసేందుకు ఏమాత్రం వెనుకాడరు. ‘కేజీఎఫ్’ రెండు పార్టులకు కన్నడలోనే కాకుండా టాలీవుడ్‌లో కూడా అంతే క్రేజ్ ఉంది. ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ (Prashanth Neel) ఒక సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఈ రెండు చిత్రాలకు టాలీవుడ్ ప్రేక్షకులు సైతం బ్రహ్మరథం పట్టారు. మొత్తానికి రాజమౌళి సెట్ చేసిన ట్రెండ్‌ను ఏ ఏ ఇండస్ట్రీలు ఫాలో అవుతాయో చూడాలి.
ప్రజావాణి చీదిరాల