Entertainment

Ram Charan: సడెన్‌గా రామ్ చరణ్‌పై ప్రేమ.. ఆర్జీవీ మారారా? మారినట్టు నటిస్తున్నారా?

ఏంటో ఈ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Director Ram Gopal Varma).. ఏం చేసినా సంచలనమే. మీరు మారిపోయారు సర్.. అనుకునేలోపు తాను మారలేదని నిరూపించుకుంటూనే ఉంటారు.

Ram Charan: సడెన్‌గా రామ్ చరణ్‌పై ప్రేమ.. ఆర్జీవీ మారారా? మారినట్టు నటిస్తున్నారా?

ఏంటో ఈ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Director Ram Gopal Varma).. ఏం చేసినా సంచలనమే. మీరు మారిపోయారు సర్.. అనుకునేలోపు తాను మారలేదని నిరూపించుకుంటూనే ఉంటారు. తాజాగా ఆయనను చూసిన వారెవరైనా మారిపోయారనే అంటారు. కానీ అది పరిస్థితులు తెచ్చిన మార్పని అనిపిస్తోంది. మళ్లీ పరిస్థితులు మారిపోతే ఆయన మారిపోతూ ఉంటారు. తాజాగా మెగా ఫ్యామిలీపై ఆయన కురిపిస్తున్న ప్రేమ చూస్తుంటే ఎవరికైనా ఆర్జీవీ (RGV) మారారా? లేదంటే మారినట్టు నటిస్తున్నారా? అనిపించక మానదు. మొన్నటికి మొన్న మెగాస్టార్ చిరంజీవిని ఇబ్బంది పెట్టి ఉంటే క్షమించాలని కోరారు.

ఇబ్బంది పెట్టి ఉంటే ఏంటి? క్షమించమని నేరుగా కోరడం వేరు.. ఇబ్బంది పెట్టి ఉంటే అనడం వేరు. ఇది కాస్తా మెగా ఫ్యాన్స్‌ (Mega Fans)కు ఆగ్రహం తెప్పించింది. చెప్పే క్షమాపణ కూడా కుదురుగా చెప్పలేరా? అంటూ మండిపడుతున్నారు. ఇక తాజాగా గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్‌ (Ram Charan)పై ఆర్జీవీ ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం రామ్ చరణ్, బుచ్చిబాబు సాన (Butchibabu Sana) కాంబోలో ‘పెద్ది’ (Peddi) సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం నుంచి ‘చికిరి చికిరి’ (Chikiri Chikiri Song) వీడియో సాంగ్ విడుదలై నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. సాంగ్ విడుదలైన నాలుగు రోజుల తర్వాత కానీ ఆర్జీవీకి ప్రశంసించాలనే ఆలోచన రాలేదు.

‘‘సినిమా రంగంలోని ప్రతి కళ అంటే దర్శకత్వం, సంగీతం, సినిమాటోగ్రఫీ వంటి వాటన్నింటి నిజమైన ఉద్దేశ్యం హీరోని హైలైట్ చేయడమే. చాలా కాలం తర్వాత, నేను రామ్‌చరణ్‌ని అత్యద్భుతమైన పెర్ఫార్మెన్స్‌ను ‘చికిరి చికిరి’ పాటలో చూశాను. అనవసరమైన హంగులూ ఆర్భాటాలను తొలగించి అద్భుతంగా ప్రెజెంట్ చేసింది. భారీ సెట్స్.. అనవసరమైన డిజైన్‌ లేదా వందలాది మంది డ్యాన్సర్స్ అవసరం లేకుండా కూడా ఒక స్టార్‌ని అద్భుతంగా ప్రెజెంట్ చేయవచ్చని నిరూపించినందుకు బుచ్చిబాబు సేనకు ధన్యవాదాలు’’ అని తెలిపారు. పాట రిలీజైన వెంటనే ఈ ధన్యవాదాలేవో తెలియజేస్తే బాగుండేది కానీ కాస్తంత ఆలస్యమవడంతో అనుమానాలు తలెత్తుతున్నాయి. చిరు తన ‘శివ’ రీరిలీజ్‌కు మద్దతు తెలిపినందుకే ఆర్జీవీకి మెగా ఫ్యామిలీపై ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందని అందరి భావన. మరి ఈ ప్రేమను ఆర్జీవీ కలకాలం నిలుపుకుంటారో లేదంటే ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేస్తారో చూడాలి.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 11, 2025 3:33 AM