Timmarajupalli TV Director Muniraju: ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర నిలబడితే ఎన్నో కథలు..
ఈతరం జెన్ జీ కిడ్స్‌కు కూడా సినిమా బాగా నచ్చుతుందని మునిరాజు తెలిపారు. మన సంప్రదాయాలు పెద్దగా ఈ తరం పిల్లలకు తెలియవని.. పల్లెటూరి వాతావరణాన్ని వారికి తెలియజేస్తానన్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా
‘మా ఊరి ఎన్టీఆర్ స్టాట్యూ దగ్గర నిలబడితే బోలెడన్ని కథలు కనిపిస్తాయి. ఆర్టిఫిషియల్ కథల జోలికి వెళ్లను’ అంటున్నారు ‘తిమ్మరాజుపల్లి టీవీ’ దర్శకుడు వి. మునిరాజు. న్యూ టాలెంట్‌ను ఎంకరేజ్ చేసే క్రమంలో హీరో కిరణ్ అబ్బవరం.. సుమైర స్టూడియోస్‌తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్‌పై ‘తిమ్మరాజుపల్లి టీవీ’ సినిమాను నిర్మించారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్‌గానూ.. వి.మునిరాజు దర్శకుడిగానూ పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌లో జోష్‌ను మేకర్స్ పెంచేశారు. ఈ క్రమంలోనే నేడు దర్శకుడు మునిరాజు మీడియాతో ముచ్చటించారు.
అలా తొలి అడుగులు..
దర్శకుడు కావాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చానని.. ఆ తరువాత ఆన్‌లైన్ ఎడిటింగ్ మొదలు పెట్టినట్టుగా మునిరాజు తెలిపారు. ఈ క్రమంలోనే ఓ కథ అనుకుని తన ఊరికి వెళ్లి అక్కడి వారితో డెమో షూట్ చేశారట. ‘మీటర్’ మూవీ షూటింగ్ సమయంలో కిరణ్ అబ్బవరంతో పరిచయమైందని మునిరాజు తెలిపారు. అప్పుడే ఆయనకు తన డెమో గురించి చెప్పానని.. కథ కూడా చెప్పడంతో డెవలప్ చేయమన్నారని తెలిపారు. అలా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీకి తొలి అడుగులు పడ్డాయన్నారు. తాను చిన్నతనంలో చూసిన ఘటనలనే కథగా మలిచానని.. తాను చూసిన మనుషుల క్యారెక్టర్ లు, వారి భావోద్వేగాలు, తన చిన్నప్పటి అనుభవాలు అన్నింటినీ రంగరించి ఈ మూవీని చిత్రీకరించినట్టు మునిరాజు తెలిపారు.
సీట్ ఎడ్జ్‌లో కూర్చొని చూస్తారు..
ఈతరం జెన్ జీ కిడ్స్‌కు కూడా సినిమా బాగా నచ్చుతుందని మునిరాజు తెలిపారు. మన సంప్రదాయాలు పెద్దగా ఈ తరం పిల్లలకు తెలియవని.. పల్లెటూరి వాతావరణాన్ని వారికి తెలియజేస్తానన్నారు. అలాగే ఈ చిత్రం ఫ్యూర్ సస్పెన్స్ డ్రామా అని.. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకు నెక్ట్స్ ఏం జరుగుతుందనే ఆసక్తితో సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారన్నారు. చివరకు మంచి ఎమోషనల్ ఫీల్‌తో థియేటర్ నుంచి బయటకు వస్తారన్నారు. రాయలసీమ నేపథ్యంలో కథ సాగుతుందని.. తన ఊరు తిమ్మరాజుపల్లి అని.. అదే ఊరిలో రియల్ లొకేషన్స్‌లో షూటింగ్ చేసినట్టుగా మునిరాజు తెలిపారు. తాను సాధ్యమైనంత వరకూ నేచురాలిటీకే ప్రాధాన్యమిస్తానని తెలిపారు. కిరణ్ అ్బవరం వంటి ప్రొడ్యూసర్ దొరకడం తమ టీమ్ మొత్తానికి అదృష్టమని.. చిన్న చిత్రానికి చాలా మంచి రిలీజ్ ఇస్తున్నారన్నారు.