Siddhu Jonnalagadda: ముచ్చటగా మూడోసారి క్రేజీ కాంబో రిపీట్
సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ఈ కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. ఇది మూడో చిత్రం కావడం విశేషం.
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) వరుసగా సినిమాలను లైన్‌లో పెడుతున్నాడు. ప్రస్తుతం తన ఆరో చిత్రాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్ సైతం ఆకట్టుకుంటోంది. సిద్ధు జొన్నలగడ్డ, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ కలయికలో ఈ చిత్రం రూపొందనుంది. ఇప్పటికే ఈ కాంబోలో రెండు చిత్రాలు వచ్చాయి. ఇది మూడో చిత్రం కావడం విశేషం. గతంలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, సిద్దు కాంబోలో డీజే టిల్లు (DJ Tillu), టిల్లు స్క్వేర్ (Tillu Square) సినిమాలు వచ్చి భారీ విజయం సాధించడంతో ఇది క్రేజీ కాంబోగా మారింది.
ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ (Sithara Entertainments), ఫార్చూన్ ఫోర్ సినిమాస్ (Fortune four Cinemas) పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు స్వరూప్ ఆర్ఎస్‌జే (Swaroop RSJ) దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో సిద్ధు జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda Movies)ను సరికొత్త అవతారంలో చూపించబోతున్నట్టుగా మేకర్స్ చెబుతున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్ (Comedy Entertainer)గా ఈ చిత్రం రూపొందనుంది. సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.
ప్రజావాణి చీదిరాల