Entertainment

Ram Charan: చెర్రీకి సిద్దరామయ్య ఆహ్వానం.. అభిమానుల కళ్లలో ఆనందం..

మెగాస్టార్ చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నుంచి గ్లోబల్ స్టార్ ట్యాగ్ లైన్ వరకూ రామ్ చరణ్ సాగించిన ప్రస్థానం సాధారణమైనది కాదు. తండ్రి పేరు సినిమాల్లోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది.

Ram Charan: చెర్రీకి సిద్దరామయ్య ఆహ్వానం.. అభిమానుల కళ్లలో ఆనందం..

మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తనయుడు రామ్ చరణ్ (Ram Charan) నుంచి గ్లోబల్ స్టార్ (Global Star) ట్యాగ్ లైన్ వరకూ రామ్ చరణ్ సాగించిన ప్రస్థానం సాధారణమైనది కాదు. తండ్రి పేరు సినిమాల్లోకి రావడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. ఆ తరువాత తన టాలెంట్‌తో కెరీర్‌ను కొనసాగించాల్సిందే. అలా కష్టపడ్డాడు. తండ్రి మెగాస్టార్ (Megastar) అనేది తలకెక్కించుకోకుండా ఒదిగి ఉన్నాడు.. గ్లోబల్ స్టార్‌గా ఎదిగాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది (Peddi)’ చిత్రం షూటింగ్ మైసూర్‌ (Mysore)లో జరుగుతోంది. కొన్ని ఆహ్వానాలు చాలా స్పెషల్‌గా ఉంటాయి. ఇవాళ (ఆదివారం) రామ్ చరణ్‌ను కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య (Karnataka CM Sidha Ramaiah) మర్యాదపూర్వకంగా ఆహ్వానం పలికారు. దీంతో చెర్రీ వెళ్లి ఆయనను కలిశాడు. రామ్ చరణ్‌ను సిద్ధ రామయ్య ఆత్మీయంగా పలకరించి సత్కరించగా.. చెర్రీ సైతం ఆయనను సత్కరించాడు. అనంతరం ఇరువురూ కాసేపు ముచ్చటించుకున్నారు. ‘పెద్ది’ సినిమాకు సంబంధించిన కొన్ని విశేషాలను సిద్దరామయ్య (Sidha Ramaiah)కు రామ్ చరణ్ తెలిపినట్టు తెలుస్తోంది. వీరివురి మధ్య సినిమాలకు సంబంధించిన చర్చ జరిగినట్టు తెలుస్తోంది. మొత్తానికి రామ్ చరణ్‌, సిద్దరామయ్యలకు చెందిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇవి చూసిన మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి.

బుచ్చిబాబు సాన (Director Butchibabu Sana) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. ‘పెద్ది’ మూవీకి సంబంధించి ఒక భారీ సాంగ్ షూటింగ్ మైసూర్‌లో జరుగుతోంది. ఈ పాటకు జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు. సుమారు 1000 మందికి పైగా డాన్సర్లు ఈ సాంగ్ షూట్‌లో పాల్గొంటున్నారు. ‘పెద్ది’ సినిమాను వెంకట సతీష్ కిలారు వృద్ధి సినిమాస్ (Vrudhi Cinemas) బ్యానర్ మీద అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers), సుకుమార్ రైటింగ్స్ (Sukumar writings) బ్యానర్లు సమర్పిస్తున్నాయి.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 31, 2025 1:59 PM