Entertainment

Vijay-Rashmika: షాకింగ్.. సీక్రెట్‌గా విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం ఓవర్..

నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) అభిమానులకు షాకింగ్ న్యూస్. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అంతేకాదండోయ్..

Vijay-Rashmika: షాకింగ్.. సీక్రెట్‌గా విజయ్ దేవరకొండ, రష్మికల నిశ్చితార్థం ఓవర్..

నటుడు విజయ్‌ దేవరకొండ(Vijay Deverakonda), రష్మిక మందన్నా (Rashmika Mandanna) అభిమానులకు షాకింగ్ న్యూస్. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. అంతేకాదండోయ్.. వీరిద్దరూ పెళ్లి (Vijay-Rashmika Marriage) పీటలు ఎక్కేందుకు ముహూర్తం సైతం ఫిక్స్ చేసుకున్నారు. ఇప్పటికే ఈ జంట ఎంగేజ్‌మెంట్ (Vijay Deverakonda and Rashmika Mandanna Engagement) కూడా జరిగినట్టు సమాచారం. ఈ క్రమంలోనే శుక్రవారం వీరి నిశ్చితార్థ వేడుక హైదరాబాద్‌లోని విజయ్‌ స్వగృహం (Vijay Devarakonda Home)లో సైలెంట్‌గా జరిగిందని తెలుస్తోంది. రెండు కుటుంబాల పెద్దలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరిద్దరి నిశ్చితార్థం జరిగినట్లు సమాచారం. మరి పెళ్లి పీటలు ఎక్కేది ఎప్పుడంటారా? ఎప్పుడో కాదండోయ్.. మరో నాలుగు నెలల్లోనే నిశ్చితార్థం జరుగనుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలోనే విజయ్ దేవరకొండ, రష్మికల జంట పెళ్లి పీటలెక్కనున్నట్టు సమాచారం.

మొత్తానికి వివాహానికి ముహూర్తం కూడా ఈ జంట ఫిక్స్ (Date fixed to Vijay-Rashmika Marriage) చేసుకుంది. అయితే ఎంతో కాలంగా అభిమానులు వీరిద్దరి ప్రేమ గురించి తెగ చర్చించుకుంటున్నారు. కనీసం ప్రేమపై క్లారిటీ కూడా ఇవ్వలేదు. ప్రేమలో ఉన్నట్టు ఏనాడూ వివరించలేదు. చివరకు ఎంగేజ్‌మెంట్ కూడా చాలా సీక్రెట్‌గా చేసుకున్నారు. ఎందుకిలా? అంత సీక్రెసీ ఏమిటి? అంతలా అభిమానించే అభిమానులకు సైతం తెలియకుండా ఎంగేజ్‌మెంట్ అంత సీక్రెట్‌గా చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో తెలియడం లేదు. ఇకపోతే విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ కలిసి ‘గీత గోవిందం’ (Geetha Govindam) చిత్రంలో నటించారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్. ఆ తరువాత ‘డియర్ కామ్రేడ్’ (Dear Comrade) చిత్రంలో నటించారు. ఈ రెండు సినిమాల్లో వీరి స్నేహం కాస్త ప్రేమగా మారింది. దీనిపై అప్పటి నుంచి ప్రచారం జోరుగానే జరుగుతోంది. సోషల్ మీడియాలో వీరిద్దరూ పెట్టిన పోస్టులు కూడా ప్రచారానికి మరింత బలాన్నిచ్చాయి. అయినా సరే.. వీరిద్దరూ స్పందించిందే లేదు. ఇప్పుడు సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 4, 2025 2:32 AM