Entertainment

Shikhandi Movie: మహాభారతంలోని పాత్ర ప్రధానాంశంగా ‘శిఖండి’

మహాభారతంలోని శిఖండి పాత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందే. భీష్మ సంహారం కోసం ప్రతిన బూనిన అంబ.. మరు జన్మలో శిఖండిగా జన్మిస్తుంది. ఆ అంశాన్ని ఆధునిక అంశాలతో జోడించి రూపొందించిన చిత్రమే ‘శిఖండి’. యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది.

Shikhandi Movie: మహాభారతంలోని పాత్ర ప్రధానాంశంగా ‘శిఖండి’

మహాభారతంలోని శిఖండి పాత్ర ప్రతి ఒక్కరికీ తెలిసిందే. భీష్మ సంహారం కోసం ప్రతిన బూనిన అంబ.. మరు జన్మలో శిఖండిగా జన్మిస్తుంది. ఆ అంశాన్ని ఆధునిక అంశాలతో జోడించి రూపొందించిన చిత్రమే ‘శిఖండి’. యువరాజ్ గౌడ, నిఖిల్, దీపక్ శెట్టి, ఖ్యాతి, నిఖిత స్వామి ప్రధాన పాత్రల్లో ఈ చిత్రం రూపొందుతోంది. పోలా మూవీస్ బ్యానర్‌పై ప్రవీణ్‌ కుమార్ పోలా ఈ సినిమాను నిర్మించిన ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. ఈ క్రమంలోనే సినిమా టీజర్ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. హీరో యువరాజ్ గౌడ మాట్లాడుతూ.. శిఖండి మూవీ కథ విన్నప్పుడు ఈ చిత్రంపై తనకు పెద్దగా అంచనాలు ఏర్పడలేదు కానీ ఇప్పుడు టీజర్ చూశాక వంద రెట్లు నమ్మకం పెరిగిందన్నారు. తాము శిఖండి అనే సినిమా చేశామని గర్వంగా చెప్పుకుంటామన్నారు. ఈ సినిమాలో మహాభారతం నుంచి ఒక గొప్ప విషయాన్ని మా డైరెక్టర్ గురుమూర్తి చెబుతున్నారు. ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ అందరూ ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు.

హీరోయిన్ నిఖిత స్వామి మాట్లాడుతూ.. ఈ చిత్రంలో తనది శిఖండి పాత్ర అని మేకర్స్ చెప్పారన్నారు. తాను కన్నడలో హీరోయిన్‌గా నటిస్తున్నానని.. గ్లామర్ రోల్స్ చేస్తున్నట్టు తెలిపారు. అలాంటి టైమ్‌లో ఈ పాత్ర తనకు బాగుంటుందా లేదా అనే సందేహం వచ్చిందని.. అయితే డైరెక్టర్, ఇతర టీమ్ మెంబర్స్ విజువల్‌గా మూవీ ఎలా ఉంటుందో వివరించారన్నారు. అప్పుడు తనకు ఈ క్యారెక్టర్, ప్రాజెక్ట్‌పై నమ్మకం ఏర్పడిందన్నారు. ప్రత్యేకంగా కన్నడలో రిలీజ్ చేసిన ఈ చిత్ర మోషన్ పోస్టర్‌కు భారీగా స్పందన వచ్చిందని.. తెలుగు ఆడియెన్స్ కూడా తమ సినిమాను బాగా ఆదరించాలని కోరుకుంటున్నానన్నారు. హీరోయిన్ ఖ్యాతి మాట్లాడుతూ.. శిఖండి సినిమాలో డాక్టర్ సంగీత క్యారెక్టర్‌లో నటిస్తున్నానని.. తను పేదల కోసం ఒక ఆస్పత్రి నిర్మించాలనుకున్నప్పుడు ఎలాంటి అడ్డంకులు ఎదురయ్యాయన్నారు. ఆ సమస్యల్ని ఎవరెవరు ఎలా పరిష్కరించారనే మూవీలో మా డైరెక్టర్ గురుమూర్తి ఆసక్తికరంగా తెరకెక్కించారన్నారు.

స్టోరీ రైటర్ సత్యదేవ్ మాట్లాడుతూ.. తనకు రీసెంట్‌గా తెలుగు యంగ్ హీరోతో కన్నడ తెలుగు ప్రాజెక్ట్ ఓకే అయ్యిందని.. ఇప్పుడు ఈ ఈవెంట్‌లో కన్నడ మూవీ టీమ్‌ను కలుసుకోవడం హ్యాపీగా ఉంది. మహాభారతంలో శిఖండిది చాలా కీలక పాత్ర అని.. భీష్మ పితామహుని అస్త్ర సన్యాసానికి కారణమైన పాత్ర శిఖండిదని సత్యదేవ్ పేర్కొన్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరూ కారణజన్ములేనని.. ప్రతి ఒక్కరి జన్మకు కారణం ఉంటుందన్నారు. నటి నీతు వనజాక్షి మాట్లాడుతూ - శిఖండి చిత్రంలో నటిస్తుండటం హ్యాపీగా ఉందని.. డైరెక్టర్ ఈ సినిమా కథ ఎంత బాగా చెప్పారో అంత బాగా తెరకెక్కించారన్నారు. ఆయన చెప్పిన ఎలిమెంట్స్ అన్నీ మూవీలో ఉన్నాయన్నారు. నటి చాందినీ మాట్లాడుతూ.. శిఖండి మహాభారతంలోని పాత్ర అనే విషయం తనకు తెలియదని.. తాను పెద్దగా చదువుకోలేదన్నారు. ఈ సినిమాలో నటించే అవకాశం వచ్చినప్పుడు భయంగా అనిపించిందని.. ఇప్పటిదాకా మమ్మల్ని కొజ్జా అని, చెక్క అని పిలుస్తున్నారు. ఈ సినిమా తర్వాత శిఖండి అని పిలుస్తారేమో అని భయపడ్డానని తెలిపారు. కానీ దర్శకుడు గురుమూర్తి గారు మహాభారతంలోని ఈ పాత్ర గొప్పదనం గురించి చెప్పిన తర్వాత ఈ సినిమాలో నటించినందుకు గర్వంగా అనిపిందన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ ప్రద్యోత్తన్ మాట్లాడుతూ.. తాను రామ్ గోపాల్ వర్మ ఐస్‌క్రీమ్ సినిమాకు మ్యూజిక్ చేశానని.. ఇటీవల తన కన్నడ మూవీ ఒకటి మంచి సక్సెస్ అయ్యిందన్నారు. ఈ చిత్రానికి బీజీఎం అందించానని.. తాను తెలుగు వాడినన్నారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అంటారని.. తాను రచ్చ గెలిచి ఇంటికి వచ్చానన్నారు. మీరంతా మా శిఖండి మూవీని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నానన్నారు. నటుడు దీపక్ శెట్టి మాట్లాడుతూ.. తాను నటిస్తున్న తొలి తెలుగు చిత్రమన్నారు. ఈ సినిమాకు టీమ్ అంతా ప్యాషనేట్‌గా కష్టపడ్డారని.. శిఖండి మూవీతో మీ అందరికీ గొప్ప సినిమాటిక్ ఎక్సిపీరియన్స్ ఇవ్వబోతున్నామన్నారు. రైటర్ ఆలపాటి మాట్లాడుతూ.. తన స్నేహితుడు ప్రవీణ్ కుమార్ ఇలాంటి గొప్ప చిత్రాన్ని నిర్మించడం సంతోషంగా ఉందని.. మహాభారతంలోని శిఖండి పాత్రను ఇప్పటి వర్తమాన కాలంలోని కథకు ముడిపెట్టి ఒక మంచి మూవీని ఆయన నిర్మిస్తున్నారు. ఈ సినిమా విజయం సాధించి మరిన్ని మంచి చిత్రాలు చేసే ఉత్సాహాన్ని తన స్నేహితుడికి ఇవ్వాలని కోరుకుంటున్నానన్నారు.

నిర్మాత పోలా ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ.. ప్రేక్షకులకు ఒక మంచిని చెప్పాలంటే సినిమా మాధ్యమమే సరైనది. శిఖండి లాంటి మంజి సబ్జెక్ట్ తో సినిమా నిర్మిస్తుండటం గర్వంగా ఉంది. ఈ సినిమాలో లవ్, కామెడీ, యాక్షన్, సెంటిమెంట్..ఇలా ప్రేక్షకులకు కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. మా సినిమా టీమ్ అంతా చాలా సపోర్ట్ చేశారు. మా మూవీ మోషన్ పోస్టర్ , టీజర్ ను దేశంలోని వివిధ నగరాల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశాం. ఈ రోజు హైదరాబాద్ లో తెలుగు ఆడియెన్స్ ముందు మా మూవీ టీజర్ రిలీజ్ చేసుకున్నాం. మా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ ఒక ఫ్యామిలీలా మూవీ కోసం కష్టపడ్డారు. త్వరలోనే శిఖండి చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తామన్నారు. నిర్మాత పోలా లక్ష్మి మాట్లాడుతూ.. సినిమా చూసి మనం వెంటనే బాగా లేదు అనేస్తామని.. కానీ ఒక సినిమా మేకింగ్‌కు ఎంతమంది కష్టపడతారో చూస్తే అలా చెప్పడానికి మనసు రాదని.. తాను కూడా ఏదైనా సినిమా చూడగానే బాగా లేదని చెప్పేదాన్నని అన్నారు. కానీ ఈ సినిమా సెట్ కి వెళ్లాక అలా చెప్పకూడదని నిర్ణయించుకున్నామన్నారు. ఈ సినిమా షూటింగ్ ముగిశాక ఒక ఫ్యామిలీకి దూరమవుతున్న ఫీలింగ్ కలిగిందన్నారు.

నటుడు ఆనంద్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో నేను కామెడీ రోల్‌లో నటించానని.. తమ మూవీ టీమ్ అంతా తెలుగులో మాట్లాడేందుకు ఎందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. అంటే వారికి తెలుగు వారు అన్నా, తెలుగు భాష అన్నా చాలా ఇష్టం. అన్నారు. డైరెక్టర్ గురుమూర్తి.వి. మాట్లాడుతూ.. మాలశ్రీ ప్రధాన పాత్రలో నటించిన మారణాస్త్ర తన తొలి సినిమా అని పేర్కొన్నారు. ఆ మూవీ తెలుగులో ‘మారణాయుధం’ పేరుతో రీమేక్ అయ్యిందని.. ఎలాంటి కథతో రెండో సినిమా చేయాలని ఆలోచిస్తున్న టైమ్‌లో మహాభారతంలో శిఖండి పాత్ర నేపథ్యంగా చేయాలని అనిపించిందన్నారు. మా ప్రొడ్యూసర్‌కు రెండు సార్లు కథ చెప్పినా ఆయనకు కనెక్ట్ కాలేదని.. మూడో సారి వెళ్లి సినిమా బిగినింగ్, ఇంటర్వెల్, ఎండింగ్ ఎలా ఉంటుందో డీటెయిల్డ్ గా చెప్పానని గురుమూర్తి పేర్కొన్నారు. వెంటనే మనం ఈ సినిమా చేద్దామని అంగీకరించానన్నారు. శిఖండి అంటే దైవ స్వరూపిణి అని.. మహాభారతంలోని ఈ పాత్రకు ఇప్పటి కలియుగంలోని కథకు ముడిపెడుతూ ఎలా సినిమా చేశాం అనేది థియేటర్‌లో చూడాలని గురుమూర్తి పేర్కొన్నారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 6, 2026 4:26 PM