Entertainment

Sharvanand: 100 కోట్ల పోస్టర్లపై శర్వా సెటైర్స్.. ఇలాంటి హీరో చాలా రేర్..

హీరోలందు శర్వానంద్.. వేరయా అనాల్సి వస్తుందేమో ఆయన వ్యక్తిత్వం చూస్తే.. సినిమా ఇలా విడుదలైన గంటల్లోనే.. సినిమా సక్సెస్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కేక్‌లు కట్ చేసి.. టపాసులు పేల్చి నానా హంగామా చేసే హీరోలున్నారు.

Sharvanand: 100 కోట్ల పోస్టర్లపై శర్వా సెటైర్స్.. ఇలాంటి హీరో చాలా రేర్..

హీరోలందు శర్వానంద్.. వేరయా అనాల్సి వస్తుందేమో ఆయన వ్యక్తిత్వం చూస్తే.. సినిమా ఇలా విడుదలైన గంటల్లోనే.. సినిమా సక్సెస్.. బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కేక్‌లు కట్ చేసి.. టపాసులు పేల్చి నానా హంగామా చేసే హీరోలున్నారు. చిత్ర మేకర్స్ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొని ఫోటోలకు ఫోజులిచ్చి దానిని ప్రమోషన్ కోసం వాడేస్తూ ఉంటారు.

శర్వానంద్ మాత్రం డిఫరెంట్. వాస్తవానికి సంక్రాంతికి విడుదలైన ఐదు సినిమాల్లో ‘నారీ నారీ నడుమ మురారీ’ చిత్రం టాప్‌లో ఉంది. దాని తర్వాతే ఏ సినిమా అయినా.. ప్రేక్షకుల సపోర్ట్ ఆ సినిమాకే ఉంది. వాస్తవానికి ఇటీవలి కాలంలో అంత మంచి చిత్రాన్ని చూడలేదని ప్రేక్షకులు అంటున్నారు. ఫుల్ ఫాల్ సైతం శర్వా సినిమాకే ప్రస్తుతం ఎక్కువగా ఉంది.

అన్నీ దొంగ లెక్కలే..

కట్ చేస్తే బయట హంగామా మాత్రం మరో సినిమా చేస్తోంది. ఆ సినిమానే టాప్ అన్నట్టుగా ప్రచారం చేసుకుంటోంది. పైగా మూడంకెల సంఖ్యలు చూపిస్తూ లెక్కలను పరుగులు పెట్టిస్తోంది. గతంలో దిల్ రాజు సైతం దీనిపై సెటైర్ వేశారు. తాము చెప్పే లెక్కలన్నీ తప్పులని తేల్చేశారు. సినిమాలను నిలబెట్టుకునేందుకు అంకెల గారడీ చేస్తూ హీరో సహా మేకర్స్ నానా హంగామా చేస్తుంటారు. కానీ శర్వానంద్ మాత్రం డిఫరెంట్. తన సినిమాకు దొంగ లెక్కలు చెప్పొద్దని మేకర్స్‌కు చెబుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సునీల్, చిత్ర దర్శకనిర్మాతలతో మేకర్స్ చిట్‌చాట్‌లో పాల్గొన్నాడు. ఈ చిట్‌చాట్‌లో భాగంగా శర్వా మేకర్స్‌కు అంకెల గారడీ వద్దని.. నిజంగా తన సినిమా రూ.100 కోట్లు సాధిస్తే మాత్రమే ప్రకటించాలని చెప్పాడు.

శర్వా ఒక్కడే..

ఇప్పుడే కాదు.. గతంలో అంటే ఆరేళ్ల క్రితమే శర్వా నటించిన ‘శతమానంభవతి’ చిత్రం రూ.100 కోట్లు సాధించింది. అప్పుడు కూడా మేకర్స్ రూ.100 కోట్లు సాధించినా కూడా అది ప్రకటించలేదట. సినిమా సక్సెస్ అయితే అదే నడుస్తుంది కానీ అంకెలు ప్రకటించాల్సిన అవసరం లేదని శర్వా అంటున్నాడు. తన సినిమా ఏదైనా కూడా తప్పుడు లెక్కలు మాత్రం ప్రకటించవద్దని మేకర్స్‌ను కోరతాడట. ఇలాంటి హీరో ఇండస్ట్రీలో శర్వా ఒక్కడే అని చెప్పాలి. మొత్తానికి ఇండస్ట్రీకి దొరికిన ఒక అరుదైన వజ్రం శర్వా. అందుకే అతడని ఫ్యామిలీ ఆడియన్స్ అక్కున చేర్చుకున్నారు. మిగిలిన హీరోల చిత్రాలకు ఒక కుటుంబంలో ఒకటో రెండో టికెట్లు తెగితే శర్వా చిత్రానికి మాత్రం పది టికెట్లు తెగుతాయి. దటీజ్ శర్వా.

కక్కలేక మింగలేక అభిమానులు..

మిగిలిన హీరోలు ఆ మాటకొస్తే స్టార్లు, ప్రొడక్షన్ హౌసెస్.. సంక్రాంతి ఫేక్ కలెక్షన్స్, పోస్టర్స్‌తో నవ్వులు పాలు అవుతున్నారు. హిట్ అయినా, ఫేక్ నంబర్స్‌తో పరువు తీసుకుంటున్నారు. దీనంతో వారి అభిమానులు సైతం కక్కలేక మింగ లేక ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి ఫేక్ ప్రకటనలు చేయకుంటే వచ్చే ఇబ్బందేం లేదు కానీ.. చేస్తేనే వచ్చేది తంటా. స్టార్లే కాదు.. వారి అభిమాన గణం సైతం తలదించుకోవాల్సిన పరిస్థితులు కల్పించడం ఎందుకు? అసలు అంకెలు ప్రకటించకుంటే వచ్చే నష్టమేంటి? మిగిలిన హీరోలతో పోలిస్తే శర్వా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నా కూడా అంతగా హైలైట్ అవడం లేదు. అయినా సరే.. సినిమా మాత్రం దూసుకెళుతోంది. సంక్రాంతి టాప్ పిక్చర్‌గా నిలిచింది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 23, 2026 3:08 AM