Shambhala: మిస్టరీ థ్రిల్లర్ ట్రైలర్ ఎలా ఉందంటే..
ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ (Shambhala). క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది.
ఆది సాయికుమార్ (Aadi Sai Kumar) హీరోగా యుగంధర్ ముని దర్శకత్వంలో రూపొందిన సూపర్ నేచురల్ థ్రిల్లర్ ‘శంబాల’ (Shambhala). క్రిస్మస్ సందర్భంగా ఈ చిత్రం డిసెంబరు 25న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్స్‌లో జోష్‌ను పెంచేసింది. ఈ క్రమంలోనే హీరో నాని (Nani) ఈ మూవీ ట్రైలర్ (Shambhala Trailer)ను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైంది కాదు’ అనే డైలాగ్‌తో ప్రారంభమైన టీజర్ ఆసక్తిగా కొనసాగింది. ట్రైలర్ రిలీజ్ అనంతరం హీరో నాని మాట్లాడుతూ.. ‘శంబాల’ ట్రైలర్‌ని చూశానని.. అద్భుతంగా ఉందన్నాడు. ఇలాంటి జానర్ చిత్రాల్నే ప్రస్తుతం ప్రేక్షకులు కోరుకుంటున్నారని పేర్కొన్నాడు. ఇలాంటి సినిమాల్ని కరెక్ట్‌గా చేస్తే.. టెక్నికల్‌గా, మేకింగ్ పరంగా సెట్ అయితే ఎలాంటి ఇంపాక్ట్‌ను క్రియేట్ చేస్తుందో ఇది వరకే చూశామని.. ఈ ట్రైలర్ చాలా ప్రామిసింగ్‌గా ఉందని నాని తెలిపాడు. ‘శంబాల’తో ఆదికి మంచి విజయం దక్కాలని ఆకాంక్షించాడు.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ఓ గ్రామం.. దానిలోని నివాసితులంతా వింతగా ప్రవర్తించటం, ఉల్కను కట్టడి చేసేందుకు మఠాధిపతులను తీసుకొచ్చి పూజలు చేయడం, ఈ మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం వంటి అంశాలతో ట్రైలర్‌ను వదిలారు. ‘ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే’ అని హీరో సాగించే పోరాటం ఎలా ఉండబోతోందన్నది చిత్రంలో చూడాల్సిందే. ‘శంబాల’కు సంబంధించి ప్రి రిలీజ్ బిజినెస్ ఇప్పటికే పూర్తైనట్టు టాక్ నడుస్తోంది. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారని సమాచారం. ఎప్పటి నుంచో ఒక మంచి హిట్ కోసం తపిస్తున్న ఆది సాయికుమార్‌కు ఈ చిత్రం మంచి కిక్ ఇచ్చే అవకాశముందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రంలో డిసెంబర్ 25న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతోన్నారు. అర్చన అయ్యర్, స్వాసిక విజయ్, మధు నందన్, రవివర్మ, మీసాల లక్ష్మణ్, షిజు మీనన్, హర్ష వర్ధన్, శివ కార్తీక్, ఇంద్రనీల్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజావాణి చీదిరాల