Sasivadane Movie: ప్రతి ఒక్కరినీ సర్‌ప్రైజ్ చేస్తుంది..
శశి వదనే’ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదని తెలిపారు. తనకు అంతగా అనుభవం లేకపోవడంతోనే రిలీజ్‌లో జాప్యం కలిగిందని.. సినిమా పూర్తవడానికి ముందే రైట్స్ అన్నీ అమ్ముడయ్యాయని పేర్కొన్నారు.

రక్షిత్ అట్లూరి (Rakshith Atluri) కోమలి ప్రసాద్ (Komali Prasad) సాయి మోహన్ ఉబ్బన (Director Sai Mohan Ubbana) రూపొందించిన చిత్రం ‘శశివదనే’ (Sasivadane). గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ, అభిలాష్ రెడ్డి గోడల ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను బీభత్సంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా హీరో రక్షిత్ మాట్లాడుతూ.. తనకు సాయి చెప్పిన కథ నచ్చలేదని.. ఆయనేం చెబుతున్నారో కూడా అర్థం కాలేదని.. కానీ సీన్లు మాత్రం నచ్చాయన్నారు. అయితే సాయి తీసిన షార్ట్ ఫిల్మ్స్ చూశానని.. వాటిలో ఆయన రాసుకున్నట్టుగా ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ సీన్స్ ఇంత వరకు తెలుగులో రాలేదన్నారు. ఈ సినిమా, సినిమాతో పాటు శ్రీమాన్ చేసిన పాత్ర అందరికీ గుర్తుండిపోతుందన్నారు.
డైరెక్టర్ సాయి మోహన్ మాట్లాడుతూ .. తాను ఇండస్ట్రీలోకి రావాలన్నది తన తండ్రి కోరిక అని తెలిపారు. తనను పది రోజుల షూటింగ్ తర్వాత హీరో రక్షిత్ నమ్మారని.. సాయి కుమార్ తన కథను అందమైన పెయింటింగ్‌లా మార్చారంటూ చెప్పుకొచ్చారు. తను కథను రాసుకున్న దానికి మించి అందంగా కోమలి నటించిందని వెల్లడించారు. శ్రీమాన్ తను చెప్పిన కథ విని వెంటనే ఓకే చేశారని.. ఆయన చేసిన సింగిల్ షాట్ సీన్ హాట్ టాపిక్‌గా మారిందని అన్నారు.
నిర్మాత అహితేజ మాట్లాడుతూ .. ‘‘శశి వదనే’ మూవీ ఏ ఒక్కరినీ కూడా నిరాశపర్చదని తెలిపారు. తనకు అంతగా అనుభవం లేకపోవడంతోనే రిలీజ్‌లో జాప్యం కలిగిందని.. సినిమా పూర్తవడానికి ముందే రైట్స్ అన్నీ అమ్ముడయ్యాయని పేర్కొన్నారు. హీరోయిన్ కోమలి ప్రసాద్ మాట్లాడుతూ .. ‘‘శశివదనే’ నాకు చాలా ప్రత్యేకమైన సినిమా అని.. ఈ చిత్రంలో తన పాత్ర చాలా కొత్తగా ఉంటుందని తెలిపింది. నేను ఈ టీంలోని చాలా మంది కొత్త వారేనని.. అంతా ప్రాణం పెట్టి సినిమా చేశారని.. తప్పక ఈ సినిమా అందర్నీ సర్‌ప్రైజ్ చేస్తుందని కోమలి చెప్పుకొచ్చింది.
ప్రజావాణి చీదిరాల