Santhana Prapthirastu: అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన వస్తోంది..
సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి టెన్షన్‌తో నిద్రపట్టలేదని... మార్నింగ్ బుక్ మై షో చూశాక ఆశ్చర్యం వేసిందన్నారు. మేజర్ థియేటర్స్‌లో బుకింగ్స్ బాగా జరిగాయన్నారు.
విక్రాంత్ (Hero Vikranth), చాందినీ చౌదరి (Chandini Chowdary) జంటగా నటించిన "సంతాన ప్రాప్తిరస్తు" (Santhana Prapthirastu) సినిమా నేడు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాపై రెండు తెలుగు రాష్ట్రాల నుంచి మంచి స్పందన రావడంతో మూవీ టీమ్ ప్రెస్ మీట్ ద్వారా తమ కృతజ్ఞతలు తెలియజేసింది. ఈ సినిమాను మధుర ఎంటర్‌టైన్‌మెంట్ (Madhura Entertainment), నిర్వి ఆర్ట్స్ బ్యానర్స్ (Nirvi Arts Banner) పై మధుర శ్రీధర్ రెడ్డి (Madhura Sridhar Reddy), నిర్వి హరిప్రసాద్ రెడ్డి (Nirvi Prasad Reddy) నిర్మించగా.. దర్శకుడు సంజీవ్ రెడ్డి (Director Sanjeev Reddy) రూపొందించారు.
ఈ కార్యక్రమంలో నిర్మాత మధుర శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సంతాన ప్రాప్తిరస్తు’ సినిమా మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రేక్షకులు చెబుతున్నారన్నారు. ఒక ఎంటర్ టైనింగ్ మూవీ కోసం ప్రేక్షకులు ఎంతగా ఎదురుచూస్తున్నారనేది తమ సినిమా సక్సెస్‌తో అర్థమైందని.. అన్ని ఏరియాల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. అన్ని ఏరియాల నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్ చేసి తమ చిత్రం బాగుందని అంటున్నారని.. క్రిటిక్స్ సైతం పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారన్నారు. నైజాంతో పాటు విజయవాడ, విశాఖ, రాజమండ్రి, ఒంగోలు..ఇలా ప్రతి ఏరియా నుంచి డిస్ట్రిబ్యూటర్స్ ఫోన్స్ చేసి సినిమా బాగుందని చెబుతున్నారు. మెయిన్ కాస్ట్ నటనపై ముఖ్యంగా ప్రశంసల జల్లు కురుస్తోందని శ్రీధర్ రెడ్డి అన్నారు.
హీరో విక్రాంత్ మాట్లాడుతూ.. సినిమా విడుదలకు ముందు రోజు రాత్రి టెన్షన్‌తో నిద్రపట్టలేదని... మార్నింగ్ బుక్ మై షో చూశాక ఆశ్చర్యం వేసిందన్నారు. మేజర్ థియేటర్స్‌లో బుకింగ్స్ బాగా జరిగాయన్నారు. రివ్యూస్ సైతం పాజిటివ్‌గా రావడం ఆనందాన్నిచ్చిందని.. దీంతో ఏడాదిన్నర కష్టం మర్చిపోయామని వెల్లడించారు. సినిమాటిక్ లిబర్టీ తీసుకోకుండా చాలా జాగ్రత్తగా సినిమాను తెరకెక్కించామని... ఆ ఫలితం తమకు దక్కిందన్నారు. హీరోయిన్ చాందినీ చౌదరి మాట్లాడుతూ.. సినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ప్రమోషన్స్‌లో చెప్పామని.. ప్రస్తుతం ప్రేక్షకులు సైతం అదే ఫీడ్ బ్యాక్ ఇస్తున్నారన్నారు. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా ఆనందంగా అనిపించిందన్నారు. రివ్యూస్‌తో పాటు సోషల్ మీడియాలోనూ మంచి స్పందన వస్తోందని చాందినీ తెలిపారు. డైరెక్టర్ సంజీవ్ రెడ్డి మాట్లాడుతూ.. ఒక సోషల్ ఇష్యూ చుట్టూ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిల్ చేసి ఎంగేజ్ చేసేలా సినిమా చేశారని.. అసభ్యత లేకుండా చూపించారంటూ ప్రశంసలు వస్తున్నాయన్నారు. కొత్త తరహా కంటెంట్ చూపిస్తే తాము ఆదరిస్తామని తెలుగు ఆడియెన్స్ మరోసారి ప్రూవ్ చేశారన్నారు.
ప్రజావాణి చీదిరాల