Biggboss9: అందరి ఎమోషన్స్‌తో ఆడుకుంటున్న సంజన..
బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో రేషన్ చాలా తక్కువ వస్తుంది. చాలీచాలని ఫుడ్‌తో కంటెస్టెంట్స్ (Biggboss Contestants) అంతా సరిపెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో గుడ్డు వస్తుంది.

బిగ్‌బాస్ 9 (Biggboss 9)లో అందరికంటే వరస్ట్‌గా సంజన గర్లానీ (Biggboss Sanjana Garlani) కనిపిస్తోంది. ఈమెకు ఏమైనా సైకలాజికల్ డిజార్డర్ ఉందో.. మరొకటో కానీ చాలా వరస్ట్‌గా ప్రవర్తిస్తోంది. దొంగతనాలే కంటెంట్ అనుకుంటుందో.. లేదంటే ఫుడ్ ఆమె ఎమోషనో కానీ అందరి గుడ్లు దొంగిలించేసి తినేసింది. అసలే బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో రేషన్ చాలా తక్కువ వస్తుంది. చాలీచాలని ఫుడ్‌తో కంటెస్టెంట్స్ (Biggboss Contestants) అంతా సరిపెట్టుకుంటూ ఉంటారు. ఒక్కొక్కరికీ ఒక్కో గుడ్డు వస్తుంది. దానిని చాలా జాగ్రత్తగా అపురూపంగా భావిస్తూ ఉంటారు. కొద్దిగా అన్నంతో ఆ గుడ్డుతో ఎలాగోలా కడుపునింపుకుంటారు. అలాంటిది అన్ని గుడ్లనూ సంజన (Biggboss Sanjana) లేపేసి తినేయడమంటే ఏంటి? ఇంతకంటే దారుణం మరొకటి ఉంటుందా?
అంతా ప్లేటులో అన్నం పెట్టుకుని గుడ్డు కోసం చూస్తే అవి కనిపించవు. అసలు ఒకట్రెండు తింటేనే గుడ్లు ఎగుటు కొట్టేస్తాయి. అలాంటిది దాదాపు పది గుడ్లను తినేసింది. సంజన పాము కంటే డేంజర్‌లా ఉంది. పైగా ఎప్పుడూ చేసే ఓవర్ యాక్షన్ ఒకటి. నాగార్జున (Nagarjuna) తిడితే తిట్టించుకుంటానని చెబుతోంది. అందరి ఎమోషన్‌తోనూ ఆడుకుంటూ అదే గేమ్ అన్నట్టుగా.. అదే కంటెంట్ అన్నట్టుగా సంజన బిల్డప్ ఇవ్వడం ప్రేక్షకులకు పెద్దగా నచ్చడం లేదు. పైగా తనకు ఎనర్జీ లేదని మెడలో వేస్తే దొంగ అని చిన్న బోర్డు వేయాలంటూ బిగ్‌బాస్ (Biggboss)కే సజెషన్స్ ఇస్తోంది. మరి ఇవాళ నాగార్జున.. సంజనను గట్టిగా మందలిస్తారా? లేదంటే.. ఏదో తిట్టి తిట్టనట్టు.. మందలించి మందలించనట్టు చేసి వదిలేస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
ఇక హౌస్‌లో చూస్తే ఇమ్మాన్యుయేల్ (Emmanuel), ఫ్లోరా శైని (Flora Saini) అయితే సంజనకు బానిసల్లా మారిపోయారు. ఒకరు కాళ్లకు నెయిల్ పాలిష్ వేస్తే.. ఇమ్మాన్యుయేల్ ఆమెకు జడలు వేస్తున్నారు. ఇక నెయిల్ పాలిష్ ఆరలేదని.. తనకు అన్నం తినిపించమని ఫ్లోరాను పిలిస్తే.. తను కూడా వెళ్లేందుకు సిద్ధమైంది. శ్రీజ (Srija), హరిత హరీష్ (Haritha Harish) చెప్పినా కూడా వినే పరిస్థితి లేదు. ఇంకా ఫ్లోరా తనను తాను సమర్థించుకుంటోంది. ఇవాళ శనివారం కాబట్టి సంజనకు నాగార్జున (King Nagarjuna) షాక్ ఇస్తారా? లేదంటే సుతిమెత్తగా చెప్పి వదిలేస్తారా? చూడాలి. ఎందుకంటే ఆది నుంచి బిగ్‌బాస్ నిర్వాహకులు సంజనకు ఫేవర్‌గానే ఉంటూ వస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల