Girl Friend: సమంత సజెషన్.. సీన్‌లోకి రష్మిక
హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుందని.. అది ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు. ఒక జంట లైఫ్‌లో జరిగిన కథను చూపించానని.. సందేశాలు, నీతులు చెప్పలేదన్నారు.
దీక్షిత్ శెట్టి, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న చిత్రం ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girlfriend). రాహుల్ రవీంద్రన్ (Rahul Ravindran) దర్శకత్వంలో ఇంటెన్స్, ఎమోషనల్ లవ్ స్టోరీగా ఈ చిత్రం రూపొందింది. సరికొత్త ప్రేమ కథగా రూపొందిన ఈ చిత్రం నవంబర్ 7న హిందీతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల (Girlfriend Release) కాబోతోంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ బీభత్సంగా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. తాజాగా రాహుల్ రవీంద్రన్ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నారు. తాను కాలేజ్‌లో ఉండగా చూసిన ఒక సంఘటన, అప్పట్లో వచ్చిన ఒక పాట కూడా తనకు ఈ కథ రాసేందుకు స్ఫూర్తినిచ్చిందని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు.
అమ్మాయిలందరికీ ఇచ్చే బిగ్ హగ్..
సమయం దొరికినప్పుడల్లా స్క్రిప్ట్ రాసుకున్నానని చెప్పుకొచ్చారు. ఆహా వాళ్లు తమ కోసం ఒక ప్రాజెక్ట్ చేయమని అడగ్గా వారికి ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథ పంపానన్నారు. ‘ది గర్ల్ ఫ్రెండ్’ కథను అల్లు అరవింద్ (Allu Arvind) సినిమాకు కావాల్సిన కంటెంట్ ఉందని.. కాబట్టి ఓటీటీకి వద్దని సినిమా చేద్దామనగానే అంతకు ముందు రష్మిక మందన్న (Rashmika Mandanna)తో చేయాలనుకున్న కథను పక్కనబెట్టి ఈ కథను సినిమాగా మొదలుపెట్టినట్టు వెల్లడించారు. రష్మిక స్క్రిప్ట్ మొత్తం రెండు రోజుల్లో చదివి కాల్ చేసి సినిమాకు ఓకే చెప్పేసిందని రాహుల్ వెల్లడించారు. ఒక అమ్మాయిగా తాను ఈ కథకు కనెక్ట్ అయ్యానని.. అమ్మాయిలందరికీ తానిచ్చే బిగ్ హగ్గే ఈ సినిమా అని రష్మిక చెప్పిందన్నారు. తొలుత సమంత (Samantha)కు స్క్రిప్ట్ పంపితే ఈ కథకు తాను కాకుండా మరొక హీరోయిన్ అయితే బాగుంటుందనే సజెషన్ ఇచ్చిందన్నారు.
రష్మిక ‘యానిమల్’ సమయంలో..
టీజర్, ట్రైలర్ (Girlfriend Trailer)లో మెయిన్ కంటెంట్‌ను దాచేసి కావాలనే మిస్ డైరెక్ట్ చేశామని రాహుల్ రవీంద్రన్ వెల్లడించారు. థియేటర్‌లోనే మెయిన్ కంటెంట్ చూస్తేనే ఎంజాయ్ చేస్తారన్నారు. ముఖ్యంగా హై వోల్టేజ్ ఇంటెన్స్ డ్రామానే సెకండాఫ్‌లో ఉంటుందని.. అది ఆడియన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తుందన్నారు. ఒక జంట లైఫ్‌లో జరిగిన కథను చూపించానని.. సందేశాలు, నీతులు చెప్పలేదన్నారు. తనకు ఇవాళ మంచి అనిపించింది.. ఐదేళ్ల తర్వాత తనకే రాంగ్ అనిపించవచ్చని కాబట్టి ఎవరికీ మెసేజ్‌లు ఇచ్చే ధైర్యం చేయబోనన్నారు. ఇంటెన్స్ ఎమోషన్ ఉన్న లవ్ స్టోరీని రియలిస్టిక్ అప్రోచ్‌లో చేశానని చెప్పారు. రష్మిక ‘యానిమల్’ రిలీజై వందల కోట్లు వసూళ్ల సాధిస్తున్న సమయంలో తనకు కొంచెం భయం వేసేదని.. ఎందుకంటే తానేమో ఆమెను రియలిస్టిక్‌గా చూపిస్తున్నానని కానీ ‘యానిమల్’ ఆడియన్స్‌పై మరో ఇంప్రెషన్ వేస్తోందని ఫీలయ్యారట. అప్పుడు రష్మికకు తన సందేహం తెలిసి కథకు తగినట్టుగానే తనను స్క్రీన్‌పై ప్రెజెంట్ చేయాలని తెలిపిందని రాహుల్ తెలిపారు.
రష్మికతో మరో సినిమా..
కాలేజ్‌లో అడుగు పెట్టగానే అమ్మాయిలు ఇష్టపడేలా ఉండే అబ్బాయి కోసం వెదికానని.. దసరా సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్‌లో దీక్షిత్ (Hero Deekshith) ను చూసి ఇతను విక్రమ్ క్యారెక్టర్‌కు బాగుంటాడటని అనిపించిందన్నారు. ఈ చిత్రంలో తాను కూడా ఒక రోల్ చేయాల్సి వచ్చిందన్నారు. అనూ ఇమ్మాన్యుయేల్ కూడా తన క్యారెక్టర్ కు పర్పెక్ట్‌గా సెట్ అయ్యిందన్నారు. నెక్ట్స్ తాను రెండు ప్రాజెక్ట్స్ డైరెక్ట్ చేయబోతున్నానని.. వాటి వివరాలు త్వరలోనే తెలియజేస్తానని రాహుల్ రవీంద్రన్ చెప్పారు. రష్మికతో కూడా మరో సినిమా చేయబోతున్నానని వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల