Samantha: నాగచైతన్య పెళ్లై ఏడాది తిరగక ముందే సమంత మ్యారేజ్.. చై ఇంట్రస్టింగ్ పోస్ట్..
సమంత, రాజ్ నిడిమోరు జంట వివాహం చేసుకుంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు.
సమంత, రాజ్ నిడిమోరు జంట వివాహం చేసుకుంది. కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్‌లో జరిగిన ఒక ప్రైవేట్ వేడుకలో ఈ వివాహం జరిగింది. ఈ వివాహానికి కేవలం 30 మంది మాత్రమే హాజరయ్యారు. ఈ వివాహం ఇంత గోప్యంగా జరగడం అనేది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమంత అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఆసక్తికర విషయం ఏంటంటే.. డిసెంబర్ 4న సమంత మాజీ భర్త నాగ చైతన్య, శోభితా ధూళిపాళ్ల జంట వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకోనుంది. సరిగ్గా మూడు రోజుల ముందు రాజ్‌ను సమంత వివాహం చేసుకోవడం ఆసక్తికరంగా మారింది.
సమంత వివాహ వార్తలు వినగానే సోషల్ మీడియా మొత్తం ఆమె గత, ప్రస్తుత వివాహాల గురించి చర్చించుకోవడం మొదలు పెట్టింది. ఈ క్రమంలోనే నెటిజన్లంతా అసలు ఈ వివాహంపై నాగ చైతన్య స్పందిస్తారా? లేదా? అనే ఆసక్తితో ఆయన సోషల్ మీడియా అకౌంట్లపై ఫోకస్ పెట్టారు. అయితే నాగచైతన్య ఒక పోస్ట్ పెట్టాడు. అయితే అది సమంత వివాహం గురించి కాదులెండి. నాగచైతన్య నటించిన ‘ధూత’ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దీనికి సంబంధించి చై పోస్ట్ పెట్టాడు. ‘ధూత’ అనేది నటుడిగా మీరు ఏదైనా క్రియేటివీటీతో పాటు నిజాయితీగా ఒక చక్కని స్క్రిప్ట్‌ను ఎంపిక చేసుకుంటే ప్రజలు తప్పక కనెక్ట్ అవుతారని నిరూపిస్తోంది. ‘ధూత’కు 2 సంవత్సరాలు. ఈ సందర్భంగా చిత్ర బృందానికి శుభాకాంక్షలు’’ తెలిపాడు.
సమంత తన వివాహాన్ని ఒక పోస్ట్‌తో ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆమె సన్నిహితులు ఈ వివాహానికి సంబంధించిన కొన్ని పిక్స్‌ను షేర్ చేశారు. సమంత, రాజ్‌ల వివాహానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మొత్తంగా 30 మంది మాత్రమే హాజరయ్యారు. ‘భూత శుద్ధి’ అనే పవిత్ర ప్రక్రియ ద్వారా వీరి వివాహం జరిగింది. లింగ భైరవి సన్నిధిలో వీరి వివాహం జరిగింది. ఈ జంటకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజావాణి చీదిరాల