Big Breaking: సైలెంట్‌గా వివాహం చేసుకున్న సమంత, రాజ్‌నిడిమోరు
సమంత (Samantha), రాజ్ నిడుమోరు (Raj Nidimoru) సైలెంట్‌గా వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా కాలంగా వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూనే ఉన్నాయి.
సమంత (Samantha), రాజ్ నిడుమోరు (Raj Nidimoru) సైలెంట్‌గా వివాహం చేసుకోవడం సంచలనంగా మారింది. చాలా కాలంగా వీరిద్దరి పెళ్లి వార్తలు సోషల్ మీడియా (Social Media)లో వైరల్ అవుతూనే ఉన్నాయి. వాటిపై ఈ జంట ఎప్పుడూ స్పందించింది కూడా లేదు. తాజాగా ఆధ్యాత్మిక కేంద్రంగా ప్రసిద్ధిగాంచిన కోయంబత్తూరులోని ఈశా ఫౌండేషన్ (Esha Foundation)లో సమంత, రాజ్ నిడిమోరు వివాహం చేసుకున్నారు. ఈశా ఫౌండేషన్‌లో ఉన్న లింగభైరవి సన్నిధిలో వీరిద్దరూ వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఈ వివాహ వేడుకకు కుటుంబ సభ్యులతో పాటు అత్యంత సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు.
కోయంబత్తూర్‌లోని ఈషా యోగా సెంటర్ (Isha Yoga Centre)లో గల లింగ భైరవి ఆలయం (Ling Bhairavi Temple)లో సమంత, రాజ్ నిడిమోరుల వివాహం సింపుల్‌గా జరిగింది. వీరిద్దరి వివాహం దక్షిణాది సంప్రదాయంలో జరిగింది. వివాహం సందర్భంగా సమంత ఎరుపు రంగు కంచిపట్టు చీరలో మురిసిపోయింది. ఆసక్తికరంగా వీరిద్దరి నిశ్చితార్థం, వివాహం రెండూ ఇవాళే ఒకదాని వెంట ఒకటి జరిగాయి. వీరి వివాహం సందర్భంగా ఈషా ఫౌండేషన్ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివాహ విషయాన్ని సోషల్ మీడియాలో సైతం ఫౌండేషన్ షేర్ చేయడంతో సమంత, రాజ్ జంటకు నెట్టింట శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రజావాణి చీదిరాల