Entertainment

Sai Durgha Tej: అసుర సంధ్యవేళ రాక్షసాగమనం

ఇవాళ సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు (Sai Durgha Tej Birthday). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) నుంచి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు.

Sai Durgha Tej: అసుర సంధ్యవేళ రాక్షసాగమనం

ఇవాళ సాయి దుర్గా తేజ్ పుట్టినరోజు (Sai Durgha Tej Birthday). ఈ సందర్భంగా ఆయన నటిస్తున్న ‘సంబరాల ఏటి గట్టు’ (Sambarala Yeti Gattu) నుంచి గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) అయితే మునుపెన్నడూ చూడని పాత్రలో కనిపించనునున్నాడని అర్థమవుతోంది. రోహిత్ కేపీ దర్శకత్వం (Director Rohith KP)లో రూపొందుతున్న ఈ చిత్రం గ్లింప్స్‌తోనే ఎంతగానో ఆకట్టుకుంది. ఏదో భారీ బడ్జెట్ చిత్రాన్ని చూస్తున్న ఫీల్ అయితే గ్లింప్స్ చూసిన వారికి అనిపించడం ఖాయం. ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ (Sai Durgha Tej) గెటప్ స్పెషల్ అట్రాక్షన్ అని చెప్పాలి. సిక్స్ ప్యాక్‌తో ఊర మాస్ గెటప్‌లో సాయి ధరమ్ కనిపిస్తున్నాడు.

‘అసుర సంధ్యవేళ మొదలైంది.. రాక్షసుల ఆగమనం’ అంటూ సాయి దుర్గా తేజ్ చెప్పే ఒకే ఒక్క డైలాగ్‌ను గ్లింప్స్‌లో చూపించారు. ఇక సినిమా ఎలా ఉంటుందనే ఆసక్తి గ్లింప్స్‌ను చూశాక రెట్టింపు అవుతుందనడంలో సందేహమే లేదు. ఉత్కంఠభరితమైన యాక్షన్ సన్నివేశాలతో ఈ చిత్రం రూపొందినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఒక గ్రిప్పింగ్ కథతో సాయి దుర్గా తేజ్, రోహిత్ వస్తున్నట్టుగా గ్లింప్స్ చెబుతోంది. ఈ చిత్రంలో సాయి దుర్గా తేజ్ సరసన ఐశ్వర్య లక్ష్మి (IShwarya Laskshmi) హీరోయిన్‌ (Sambarala Yeti Gattu Heroine)గా నటిస్తోంది. జగపతి బాబు (Jagapathi Babu), సాయి కుమార్ (Sai Kumar), శ్రీకాంత్ (Srikanth), అనన్య నాగళ్ల (Ananya Nagalla) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 15, 2025 7:36 AM