Biggboss 9: రీతూ వర్సెస్ దివ్వెల మాదురి.. కొట్టుకునే వరకూ వెళ్లిన వాగ్వాదం
బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఆసక్తికరంగా కొనసాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో దివ్వెల మాదురి వర్సెస్ రీతూ చౌదరి (Divvela Madhuri Vs Rithu Chowdary) గట్టి యుద్ధమే జరిగింది.

బిగ్‌బాస్ 9 తెలుగు (Biggboss 9 Telugu) ఆసక్తికరంగా కొనసాగుతోంది. తాజాగా బిగ్‌బాస్ హౌస్ (Biggboss House)లో దివ్వెల మాదురి వర్సెస్ రీతూ చౌదరి (Divvela Madhuri Vs Rithu Chowdary) గట్టి యుద్ధమే జరిగింది. ఇద్దరూ నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకూ వెళ్లింది. వాస్తవానికి మాదురి వచ్చీ రాగానే రీతూ ఆమెకు లక్కలా అతుక్కుపోయింది. ఇద్దరి మధ్య బయట పరిచయం ఉందనే టాక్ కూడా నడిచింది. ఎందుకంటే దివ్వెల మాదురి (Divvela Madhuri) రాగానే రీతూ (Rithu) చాలా తెలిసిన వ్యక్తిలా మాట్లాడింది. అప్పటి నుంచి ఇద్దరూ చాలా బాగుంటున్నారు. పైగా తన తరుఫున నామినేషన్స్ (Biggboss Naminations) రీతూ వేయడం విశేషం. ఇదిలా ఉండగా.. వీరిద్దరికీ తాజాగా బీభత్సమైన గొడవ జరిగింది. ఇద్దరిలో రీతూదే మిస్టేక్ అని వారి గొడవ చూసిన వారికి అర్థమవుతుంది. నైట్ బిగ్‌బాస్ హౌస్‌లో లైట్స్ హాఫ్ అయ్యాక ఎవరూ మాట్లాడవద్దని తద్వారా తమ నిద్రకు భంగం కలుగుతుందని దివ్వెల మాదురి చెప్పింది.
మార్నింగ్ బిఫోర్ సాంగ్ కూడా ఎవరైనా లేస్తే మాట్లాడకండి. నిద్ర పట్టడం లేదు. లైట్స్ హాఫ్ చేశాక మీకేమైనా ప్రాబ్లమ్ ఉంటే గార్డెన్ ఏరియాలో మాట్లాడుకోండని గట్టిగా చెప్పింది. దాదాపుగా అంతా ఓకే అన్నట్టుగా చెప్పారు. దీనికి బిగ్‌బాస్ రూలా (Biggboss Rule) అని రీతూ చౌదరి అడిగింది. దీనికి దివ్వెల మాదురి పెద్ద ఎత్తున ఫైర్ అయిపోయింది. దీనికి రీతూ మండిపోయింది. అప్పుడు దివ్వెల మాదురి మీరు నవ్వినా తనకు నిద్ర పట్టడం లేదని.. తన ఆరోగ్యం తనకు ముఖ్యమని తెలిపింది. హే ఎక్కువ మాట్లాడకని మాదురి.. రీతూ నవ్వితే తనకు ప్రాబ్లమ్ అవుతుందని చెప్పింది. అప్పుడు రీతూ అందరినీ మీకు ప్రాబ్లమ్ లేదా? అని అడిగింది. వాష్ రూమ్‌కి వెళ్లాల్సి వస్తే మాత్రం తప్పదని అప్పుడు కూడా డోర్ మెల్లగానే తీసి వేస్తున్నామని మరొకరు చెప్పారు. భరణి (Actor Bharani) కలుగజేసుకుని నిద్ర డిస్టర్బ్ అవుతుందని చెప్పడంలో తప్పు లేదు. ఎవరికైనా నిద్ర డిస్టర్బెన్స్ ఉందంటే మనం కన్సిడర్ చేయాలని చెప్పాలని చెప్పుకొచ్చాడు. దీనిపై మొత్తానికి మాదురి వర్సెస్ రీతూ (Madhuri Vs Rithu) పెద్ద ఎత్తున ఫైర్ అయ్యింది. ఇద్దరూ కొట్టుకునే వరకూ వెళ్లిపోయింది.