Entertainment

Rimjim: 90ల్లో ఏపీలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ‘రిమ్‌జిమ్’..

ఒక పిరియాడిక్ మూవీ.. అందునా నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అలాంటి ఒక ప్రాజెక్ట్‌తో మెగా ఫోన్ పట్టారు హేమసుందర్.

Rimjim: 90ల్లో ఏపీలో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా ‘రిమ్‌జిమ్’..

ఒక పిరియాడిక్ మూవీ.. అందునా నిజంగా ఒక ప్రాంతంలో జరిగిన సంఘటనల ఆధారంగా సినిమా తీయాలంటే గట్స్ ఉండాలి. అలాంటి ఒక ప్రాజెక్ట్‌తో మెగా ఫోన్ పట్టారు హేమసుందర్. 1990ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకున్న సంఘటనల ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు సిద్ధమయ్యారు. సచేతన్ రెడ్డి, డా. మానస, శ్రీనివాసరావు నిర్మాణంలో ‘రిమ్‌జిమ్’. ‘అస్లీదమ్’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా రూపొందుతోంది. స్నేహం, ప్రేమ కథ నేపథ్యంలో రూపొందనున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.

ఈ క్రమంలోనే దర్శకుడు హేమ సుందర్ మాట్లాడుతూ.. సినిమా అవుట్‌పుట్ చాలా బాగా వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి సంబంధించిన విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నామని వెల్లడించారు. ప్రేక్షకులందరికీ నచ్చేలా సినిమాను తీర్చిదిద్దామని చెప్పారు. ఏవీ సినిమాస్, సి విజువల్స్ బ్యానర్లపై జి. సచేతన్ రెడ్డి, డాక్టర్ మానస, శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దర్శకత్వంతో పాటు కథ, స్క్రీన్‌ప్లే బాధ్యతలను సైతం హేమ సుందర్ చేపట్టారు. ఈ చిత్రంలో ఆస్కార్ అవార్డు విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కీలక పాత్రలో నటించనుండగా.. ఆయన పాడిన రెండు పాటలు సినిమాకు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఈ చిత్రంలో అజయ్ వేద్, వ్రజన హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బిత్తిరి సత్తి, రాజ్ తిరందాస్ తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 5, 2026 5:57 AM