Raviteja: సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలేస్తున్న ‘ఇరుముడి’ సాంగ్..
మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయడం లేదు కానీ వారం క్రితం విడుదల చేసిన పాట మాత్రం సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలేస్తోంది.
మాస్ మహారాజా రవితేజ హీరోగా, ప్రియ భవాని శంకర్ హీరోయిన్‌గా రూపొందుతున్న చిత్రం ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం ప్రమోషన్స్ అయితే పెద్దగా చేయడం లేదు కానీ వారం క్రితం విడుదల చేసిన పాట మాత్రం సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలేస్తోంది. ఆ తరువాత విడుదలైన గ్లింప్స్‌ను సైతం మోసుకెళ్లే బాధ్యతను ఈ సాంగ్ భుజాన వేసుకుంది. గ్లింప్స్‌తో తండ్రీకూతుళ్ల సెంటిమెంట్ ఆకట్టుకుంటోంది. కూతురే తన ప్రపంచంగా బతికే తండ్రి.. ప్రాణానికి ప్రాణమైన తన కూతురుకు ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఎంత ఆవేశంగా తిరగబడతాడు? ఆ తరువాత కూతురు మందు మానేయమని అడిగిందని అయ్యప్ప భక్తుడిగా మారి తన కూతురుతో కలిసి మాలధారణ గావించడం వంటి అంశాలతో గ్లింప్స్‌ను వదిలారు.
‘మల్లెపూల పల్లకి.. బంగారు పల్లకి.. మణికంఠుడెక్కినాడు అందాల పల్లకి’ అంటూ సాగే ఈ పాట వారం క్రితం ‘ఇరుముడి’ చిత్రం నుంచి విడుదలైంది. ఈ సినిమా సోషల్ మీడియా సామ్రాజ్యాన్ని ఏలేస్తోంది. ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేస్తుండటంతో ఇది సంచలనంగా మారింది. ఈ పాటతో పాటు గ్లింప్స్ కూడా ప్రస్తుతం నెట్టింట సంచలనం క్రియేట్ చేస్తోంది. మొత్తానికి శివ నిర్వాణ తన గత సినిమాలో మాదిరిగానే ముందుగానే సినిమా ప్లాట్ వదిలారు. సాంగ్, గ్లింప్స్ కలిసి సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. తాజాగా సినిమా నుంచి కీలక అప్‌డేట్ వచ్చేసింది. అదే సినిమా విడుదల తేదీ. ఈ చిత్రం 2026 ఆగస్టు 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. భక్తి భావోద్వేగాల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా రూపొందనుంది.