Entertainment

Rashmika Mandanna: 9 ఏళ్లు.. 25 చిత్రాలు.. రూ.50 నుంచి రూ.1000 కోట్ల రేస్‌లోకి.. వాటే జర్నీ..

‘కిరిక్ పార్టీ’ (Kirik Party) అనే కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ముద్దుగుమ్మ రష్మిక మందన్న (Rashmika Mandanna). మూడు కన్నడ చిత్రాల తర్వాత ‘చలో’ చిత్రం (Chalo Movie) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.

Rashmika Mandanna: 9 ఏళ్లు.. 25 చిత్రాలు.. రూ.50 నుంచి రూ.1000 కోట్ల రేస్‌లోకి.. వాటే జర్నీ..

‘కిరిక్ పార్టీ’ (Kirik Party) అనే కన్నడ చిత్రంతో సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి ముద్దుగుమ్మ రష్మిక మందన్న (Rashmika Mandanna). మూడు కన్నడ చిత్రాల తర్వాత ‘చలో’ చిత్రం (Chalo Movie) తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఆమె కెరీర్ టర్నింగ్ పాయింట్. ఆ తరువాత వచ్చిన ‘గీత గోవిందం’ (Geetha Govindam) బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. రష్మికను స్టార్ హీరోయిన్‌ని చేసింది. అక్కడి నుంచి రష్మిక హవా ప్రారంభమైంది. ఆ తరువాత తమిళం, హిందీ భాషల్లోనూ సత్తా చాటింది. మొత్తానికి నేషనల్ క్రష్‌గా మారింది. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ (Indian Film Industry)లోకి ఎంట్రీ ఇచ్చి తొమ్మిదేళ్ల జర్నీని పూర్తి చేసుకుంది.

9 ఏళ్ల కెరీర్ లో నాలుగు భాషల్లో మొత్తంగా 25 సినిమాల్లో నటించింది. వాస్తవానికి రష్మిక తన తొలి చిత్రం ‘కిరిక్ పార్టీ’తోనే రూ.50 కోట్లు అందుకుంది. ఈ చిత్రం రూ.4 కోట్లతో రూపొందింది. అంటే దాదాపు 13 రెట్ల లాభాన్ని అందుకుంది. ఇక ఇప్పుడు రష్మిక నటించిన చిత్రాలు రూ.1000 కోట్ల రేస్‌లో ఉంటున్నాయి. కేవలం తొమ్మిదేళ్ల కాలంలో రూ.50 కోట్ల నుంచి రూ.1000 కోట్లు అందుకోవడం అంటే సాధారణ చిత్రం కాదు. ప్రస్తుతం దక్షిణాదిలోనే అత్యధిక రెమ్యూనరేషన్ (Rashmika Remuneration) తీసుకుంటున్న హీరోయిన్‌గా మారింది. పాన్ ఇండియా (Pan India) స్థాయిలో వరుస విజయాలు సాధిస్తూ గోల్డెన్ లెగ్‌ (Rashmika Golden Leg)గా మారిపోయింది. రష్మిక ఉంటే సినిమా హిట్ అనేంతగా ఎదిగి.. దర్శకనిర్మాతల ఫస్ట్ ఛాయిస్‌గా మారింది.

అందం, నటన.. సక్సెస్ రేటు అన్నీ మిక్స్‌డ్‌గా ఉండటంతో ఈ ముద్దుగుమ్మకు దేశ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. అమ్మడు నటించిన ‘పుష్ప (Pushpa), పుష్ప 2 (Pushpa 2), యానిమల్ (Animal), ఛావా (Chhaava), థామా (Thama)’ చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులు (Box Office Records) తిరగరాశాయి. ఇక ప్రస్తుతం కూడా ఈ బ్యూటీ క్వీన్ (Beauty Queen) చేతుల్లో చాలా చిత్రాలున్నాయి. ఆమె నటించిన ‘ది గర్ల్ ఫ్రెండ్’ (The Girl Friend) సినిమా నవంబర్ 7న పాన్ ఇండియా వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్ (The Girl Friend Trailer) తాజాగా విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ చిత్రం రష్మిక కెరీర్‌కు మరో మైలు రాయి కానుందనే టాక్ నడుస్తోంది. ఇక చూడాలి ఏం జరుగుతుందో..

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 26, 2025 4:02 AM