Entertainment

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్'

‘మ్యాడ్’, ‘జిగ్రీస్’ వంటి చిత్రాలతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ నితిన్ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు.

రామ్ నితిన్ బర్త్‌డే స్పెషల్.. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్'

‘మ్యాడ్’, ‘జిగ్రీస్’ వంటి చిత్రాలతో యువ ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ టాలెంటెడ్ హీరో రామ్ నితిన్ మరో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. నారా రోహిత్ "సుందరకాండ" ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ధీరజ్ మొగిలినేని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇవాళ రామ్ నితిన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.

ఈ రోజు హీరో రామ్ నితిన్ బర్త్ డే సందర్భంగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా బర్త్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ కలర్ ఫుల్ కాలేజ్ ఫెస్ట్ వైబ్స్‌తో యూత్‌ను విపరీతంగా ఆకట్టుకుంటోంది. 'ఫన్, ఫెస్ట్, కెయాస్..బిగిన్స్ సూన్' అంటూ పోస్టర్‌లో క్యాప్షన్ పెట్టి సినిమాపై క్యూరియాసిటీని పెంచేశారు. సినిమా ఎంత ఎంటర్ టైనింగ్‌గా ఉండబోతుందో చెప్పకనే చెప్పేశారు. కాకినాడలోని ఓ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే పక్కా యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ చిత్రమిది.

ఇప్పటికే మంచి హీరోగా ప్రూవ్ చేసుకున్న రామ్ నితిన్, "ది గర్ల్ ఫ్రెండ్" వంటి పర్పస్ ఫుల్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్‌తో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న ధీరజ్ మొగిలినేని, కెన్ అండ్ గ్యాంగ్ "యూత్" మూవీని తెలుగు ప్రేక్షకులకు అందించి ఫస్ట్ వెంచర్‌లోనే సక్సెస్ అందుకున్న యంగ్ ప్రొడ్యూసర్స్ వినీత్, సందీప్, "సుందరకాండ" సినిమాతో యూత్‌తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్‌ను అలరించిన డైరెక్టర్ వెంకటేష్ నిమ్మలపూడి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా. కాబట్టి ఆదిలోనే అంచనాలు బాగా పెరిగాయి. ఈ సినిమాకు "లిటిల్ హార్ట్స్" ఫేమ్ సింజిత్ యెర్రమల్లి మ్యూజిక్ మరో స్పెషల్ అట్రాక్షన్ కానుంది. మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలోనే ఇవ్వబోతున్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 4, 2026 4:51 PM