Ram Charan: రామ్‌చరణ్ దంపతులకు కవలలు.. తీరిన చిరు చిరకాల కోరిక
ఆడపిల్లల హాస్టల్‌కు వార్డెన్‌ను అంటూ గతంలో మెగాస్టార్ చిరంజీవి.. తనకు వారసుడు కావాలని చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి మరో వారసురాలితో పాటు వారసుడు కూడా బోనస్‌గా వచ్చేశాడు.
ఆడపిల్లల హాస్టల్‌కు వార్డెన్‌ను అంటూ గతంలో మెగాస్టార్ చిరంజీవి.. తనకు వారసుడు కావాలని చెప్పకనే చెప్పేశారు. మొత్తానికి మరో వారసురాలితో పాటు వారసుడు కూడా బోనస్‌గా వచ్చేశాడు. రామ్ చరణ్ దంపతులకు కవలలు జన్మించారు. ఒక మగ, ఆడబిడ్డలకు ఉపాసన జన్మనిచ్చినట్టుగా మెగాస్టార్ చిరంజీవి ట్విటర్ వేదికగా వెల్లడించారు. తల్లీ బిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని.. తమ కుటుంబంలోకి కొత్త సభ్యులు రావడం సంతోషం కలిగిస్తోందని చిరు చెప్పారు. ఇప్పటికే రామ్ చరణ్ దంపతులకు కుమార్తె క్లింకార ఉంది. క్లింకారకు తమ్ముడు, చెల్లి జతయ్యారు.
ఈ వార్తతో మెగా అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఇక మెగాస్టార్ చిరంజీవి సంగతైతే చెప్పనక్కర్లేదు. ఆయన ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. వారసుడి కోసం చిరు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నారు. కూతుళ్లకు సైతం ఆడపిల్లలే కావడంతో ఆడపిల్లల హాస్టల్‌కు వార్డెన్ అయిపోయానంటూ గతంలో ఒక ఈవెంట్‌లో వ్యాఖ్యానించి హాట్ టాపిక్ అయ్యారు. మొత్తానికి ఇన్నాళ్లకు చిరు ఎదురు చూసిన తరుణం రానే వచ్చింది. చిరు చిరకాల కోరిక అయితే నెరవేరింది.