Raju Weds Rambai: బాధిత కుటుంబం పర్మిషన్ ఇచ్చింది కానీ...
ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు కానీ అలాంటిదేనని సాయిలు తెలిపారు. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకుంటూ ఉంటాడట. అందుకే రాజు వెడ్స్ రాంబాయి అని రాస్తుంటాడట.
అఖిల్ (Akhil), తేజస్విని (Tejaswini) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి (Raju Weds Rambai)’. వేణు ఉడుగుల (Venu Vudugula), రాముల్ మోపిదేవి (Ramul Mopidevi) నిర్మించిన ఈ చిత్రానికి సాయిలు కంపాటి (Sailu Kampati) దర్శకత్వం వహించారు. నవంబర్ 21న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సాయిలు కంపాటి మీడియాకు సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలను వెల్లడించారు. వరంగల్ జిల్లాకు చెందిన తనకు చిన్నప్పటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండేదని సాయిలు తెలిపారు. ‘16 టీన్స్, సంపంగి’ వంటి చిత్రాలు చూశాక తనకు సినిమాపై ఆసక్తి పెరిగిందని వెల్లడించారు. తన స్నేహితుడు ఒకరు ఇండస్ట్రీకి వచ్చి.. ‘గ్రీకువీరుడు’ (Greekuveerudu) చిత్రానికి డైరెక్షన్ డిపార్ట్‌మెంటులో వర్క్ చేశారని.. ఆయన తనకు సినిమాపై ఉన్న ఆసక్తిని గమనించి ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చారు.
తాను బీటెక్ పూర్తి చేసిన మీదట ఉద్యోగ యత్నాల్లో ఉన్నా కూడా మనసు మాత్రం సినిమాపైనే ఉండేదని సాయిలు తెలిపారు. అప్పుడు కొన్ని స్క్రిప్ట్ రాసుకోవడం మొదలు పెట్టానని చెప్పుకొచ్చారు. తొలుత కమర్షియల్ స్క్రిప్ట్ గురించి ఆలోచించానని.. ఆ తరువాత మాత్రం మన నేటివిటీ, మన ఆత్మ మూవీలో కనిపించాలని అనిపించడంతో ఆ తరహా స్క్రిప్ట్ రైటింగ్ ప్రారంభించానని తెలిపారు. వేణు ఉడుగుల, శ్రీకాంత్ అడ్డాల (Srikanth Addala) వద్ద డైరెక్షన్ డిపార్ట్ మెంట్‌లో వర్క్ చేశానని.. ఆ సమయంలోనే వేణు ఊడుగులకు ‘రాజు వెడ్స్ రాంబాయి’ కథ చెప్పానని తెలిపారు. ఆయనకు బాగా నచ్చడంతో ఒక డెమో షూట్ చేసుకుని రమ్మన్నారని చెప్పారట. అది చేశాక సినిమా అవకాశం ఇచ్చారని.. ఆ తర్వాత ఈటీవీ విన్ (Etv Win) వాళ్లు కూడా తమ ప్రాజెక్ట్‌లో చేరారన్నారు.
ఇది పరువు హత్యకు సంబంధించిన కథ కాదు కానీ అలాంటిదేనని సాయిలు తెలిపారు. రాజు తన ప్రేయసి రాంబాయిని పెళ్లి చేసుకున్నట్లే ఊహించుకుంటూ ఉంటాడట. అందుకే రాజు వెడ్స్ రాంబాయి అని రాస్తుంటాడట. అయితే కథలో ప్రేమికులకు ఏం జరిగిందనేది మాత్రం తెరపైనే చూడాలన్నారు. ఇదొక రియల్ స్టోరీ అని.. 2004లో ఈ ఘటన గురించి విన్నానని తెలిపారు. ఈ కథలో బాధిత కుటుంబం నుంచి సినిమా చేయడానికి ముందే వారి నుంచి పర్మిషన్ తీసుకున్నట్టు తెలిపారు. అయితే తమ పేర్లు, ఫోటోలు బయటకు రాకుండా చూడమని కోరినట్టు వెల్లడించారు. హీరో అఖిల్ కూడా తమ వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తేనని.. రాజు క్యారెక్టర్‌కు కావల్సిన ఈజ్ అఖిల్‌లో కనిపించిందన్నారు. రాంబాయి క్యారెక్టర్ కోసం మాత్రం చాలా సెర్చ్ చేసినట్టు తెలిపారు.
హీరోయిన్ ఫాదర్ రోల్ కోసం చైతన్య జొన్నలగడ్డను తీసుకున్నామని.. ఆయన యూఎస్ నుంచి తమ ఆఫీసుకి వచ్చారని.. అప్పుడు చాలా స్టైలిష్‌గా కనిపించాడని సాయిలు వెల్లడించారు. ఆయనలో ఒక సైక్ లుక్ కనిపించిందన్నారు. సినిమా షూటింగ్ గతేడాది నుంచి ప్రారంభించామని.. షూటింగ్ జరిగిన తర్వాత వర్షాలు, వరదలు వచ్చి ఆ ఊరు మునిగిపోయిందన్నారు. కంటిన్యుటి కోసం అదే ఊరిలో షూటింగ్ చేయాలి కాబట్టి వర్షాల కారణంగా చాలా కాలం పాటు వేచి ఉండాల్సి వచ్చిందన్నారు. సినిమా స్క్రిప్ట్ ఎలా ఉండాలో తనకు తెలియదని.. తెలిసినవన్నీ రాశానన్నారు. అప్పుడు స్క్రిప్ట్ ఎలా ఉండాలనేది వేణు ఊడుగుల తెలిపారన్నారు. సురేష్ బొబ్బిలి సంగీతం సినిమాకు స్పెషల్ అట్రాక్షన్ అని నిలుస్తుందన్నారు. తన తదుపరి చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని.. త్వరలోనే ప్రాజెక్ట్ అనౌన్స్ చేయనున్నట్టు సాయిలు వెల్లడించారు.
ప్రజావాణి చీదిరాల