Entertainment

Raju Weds Rambai: క్లైమాక్స్‌లో ఊపిరి ఆడనట్లు అనిపించింది..

ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయని అఖిల్ తెలిపాడు. ప్రేమకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో రాజు అనే క్యారెక్టర్ నిలబడుతుందని.. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులంతా ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారనేది ఈ మూవీ కథ

Raju Weds Rambai: క్లైమాక్స్‌లో ఊపిరి ఆడనట్లు అనిపించింది..

అఖిల్ రాజ్ (Akhil Raj), తేజస్విని (Tejaswini) జంటగా నటిస్తున్న చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’ (Raju Weds Rambai). ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు ఈటీవీ విన్ (Etv Win) ఒరిజినల్స్ ప్రొడక్షన్ తీసుకొస్తోంది. సాయిలు కంపాటి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వేణు ఊడుగుల (Venu Vudugula), రాహుల్ మోపిదేవి (Rahul Mopidevi) నిర్మిస్తున్నారు. నవంబర్ 21న ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను వంశీ నందిపాటి (Vamsi Nandipati), బన్నీ వాస్ (Bunny Vas) గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు తీసుకొస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చిత్ర హీరో హీరోయిన్స్ అఖిల్ రాజ్, తేజస్విని సినిమా హైలైట్స్‌ను మీడియాకు తెలిపారు

హీరో అఖిల్ రాజ్ మాట్లాడుతూ.. యాక్టర్ కావాలి అనేది తన కల అని.. ఇంటర్ చదివాక మీడియాలో యాంకర్, ఫొటోగ్రాఫర్ గా వర్క్ చేశానని తెలిపాడు. ఆ తరువాత యూట్యూబ్ షార్ట్ ఫిలింస్ చేశాక.. ‘విందుభోజనం’ అనే మూవీ చేసినట్టుగా వెల్లడించాడు. ఇవన్నీ చేస్తున్న టైమ్‌లోనే లాక్ డౌన్ వచ్చిందని తెలిపారు. అందరితో పాటు తానూ ఆగిపోయానని తెలిపాడు. కొన్నాళ్లు థియేటర్ ట్రైనింగ్ తీసుకున్న మీదట ‘రాజు వెడ్స్ రాంబాయి’ మూవీకి ఆడిషన్ చేసి సెలెక్ట్ అయినట్టుగా పేర్కొన్నాడు. తనకు తెలంగాణ యాస తెలిసినా కూడా పదాలు పలికే తీరులో మార్పుంటుందన్నారు. కథ జరిగిన ఊరిలో ఎలా మాట్లాడుతారో తాను డైరెక్టర్ నుంచి తెలుసుకున్నట్టుగా తెలిపాడు. రెండు నెలల పాటు సినిమా కోసం డప్పు కొట్టడం కూడా నేర్చుకున్నట్టు వెల్లడించాడు.

ఈ చిత్రంలో తాను చేసిన రాజు పాత్ర ప్రతి అబ్బాయికి కనెక్ట్ అవుతుందని.. ప్రతి ప్రేమలో బాధ, కోపం, సంతోషం ఉంటాయని అఖిల్ తెలిపాడు. ప్రేమకు ఎదురయ్యే ప్రతి పరిస్థితిలో రాజు అనే క్యారెక్టర్ నిలబడుతుందని.. నిజమైన ప్రేమలో ఉన్న ప్రేమికులంతా ఒకరి కోసం మరొకరు ఎంత బలంగా నిలబడతారనేది ఈ మూవీ కథ అని పేర్కొన్నాడు. ఇదొక చాలా ఇంటెన్స్ స్టోరీ స్క్రిప్ట్ చదివేప్పుడు క్లైమాక్స్‌లో ఊపిరి ఆడనట్లు అనిపించిందని తెలిపాడు. తేజస్విని మంచి కోస్టార్ అని.. హెల్దీ డిస్కషన్‌తో ప్రతి సీన్ ముందు ప్రిపేర్ అయ్యేవాళ్లమని పేర్కొన్నాడు. పదేళ్లుగా ఇండస్ట్రీలో స్ట్రగుల్ అవుతున్నానని.. తన కష్టానికి ఫలితం ఈ సినిమా తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నాడు. ఇటీవల తనకు వేరే కొన్ని ఆఫర్స్ వచ్చాయని.. కానీ ఈ సినిమా కోసం వెళ్లకుండా ప్రమోట్ చేసుకుంటున్నట్టు తెలిపాడు.

హీరోయిన్ తేజస్విని మాట్లాడుతూ.. తన జర్నీ 2019లో బిగిన్ అయ్యిందని... ఆ ఏడాది ఒక షార్ట్ ఫిలింలో నటించానని తెలిపింది. ఆ తర్వాత ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాకు ఆడిషన్ ఇచ్చానని.. తనను సెలెక్ట్ చేశారని పేర్కొంది. ‘కమిటీ కుర్రోళ్లు’ మూవీ డైరెక్టర్ యదు వంశీ ద్వారా ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా గురించి తెలిసిందని.. ఈ చిత్రంలో రాంబాయి క్యారెక్టర్‌కు తాను సరిపోతానని సెలెక్ట్ చేశారని.. అలా ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని వెల్లడించింది. తాను పుట్టింది రాజమండ్రిలోనని.. ఈ సినిమాలో తెలంగాణ యాస మాట్లాడేందుకు దర్శకుడు సాయిలు సపోర్ట్ చేశారని తెలిపింది. రాంబాయి పాత్ర ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలని తమ డైరెక్టర్ అనుకున్నారో, తాను అలాగే చేసి ఆయనను మెప్పించినట్టు తేజస్విని పేర్కొంది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ ట్రైలర్ రిలీజ్ అయ్యాక ప్రతి ఒక్కరూ తనకు మంచి ఫీడ్ బ్యాక్ ఇచ్చారని తెలిపింది.

రాంబాయి పాత్రలో అనేక లేయర్స్ ఉన్నాయని... తను ప్రేమికుడు రాజు దగ్గర క్యూట్‌గా హ్యాపీగా ఉంటుందని.. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యంగా నిలబడుతుందని తేజస్వినిపేర్కొంది. తన ప్రేమను తండ్రి అంగీకరించాలని రాంబాయి తపన పడుతూ ఉంటుందని.. ఇలాంటి క్యారెక్టర్స్ హీరోయిన్‌కు దొరకడం అరుదనే చెప్పాలి. ఈ సినిమా క్లైమాక్స్ పార్ట్ షూట్ చేస్తున్నప్పుడు పర్సనల్‌గా చాలా ఎమోషనల్ అయ్యానని.. చివరి 30 నిమిషాలు హార్డ్ హిట్టింగ్‌గా ఉంటుందని తెలిపింది. నటించిన తర్వాత ఆ సీన్ నుంచి బయటకు రావడం కష్టంగా ఉండేదని.. అంతగా ఉద్వేగానికి గురైనట్టు తెలిపింది. ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమాను 7 జీ బృందావన్ కాలని, ప్రేమిస్తే, బేబి, సైరత్’ వంటి కల్ట్ మూవీస్‌తో పోల్చుకోవచ్చని తేజస్విని తెలిపింది.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 19, 2025 2:18 AM