Entertainment

Rajamouli: మహేష్ సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి

మహేష్ పాత్ర గురించి కానీ.. కష్టం గురించి కానీ మాట్లాడనని.. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతానని రాజమౌళి వెల్లడించారు. ఇక మహేష్ గురించి రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఏంటంటే..

Rajamouli: మహేష్ సీక్రెట్ బయటపెట్టిన రాజమౌళి

రామోజీ ఫిల్మ్ సిటీ (Ramoji Film City) వేదికగా #GlobeTrotterevent అత్యంత వైభవంగా జరిగింది. రాజమౌళి (Rajamouli), మహేష్ బాబు (Mahesh Babu) కాంబో చిత్రానికి సంబంధించిన టైటిల్‌‌ను గ్లింప్స్‌తో విడుదల చేశారు. ఈ సినిమాలో రుద్ర అనే పాత్రలో మహేష్ పోషిస్తున్నారు. ప్రియాంక చోప్రా వచ్చేసి మందాకినిగా.. విలన్‌గా పాత్రలో నటిస్తున్న పృథ్వీరాజ్ సుకుమారన్ వచ్చేసి ‘కుంభ’గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలతో పాటు మహేష్ సీక్రెట్‌ను రాజమౌళి వెల్లడించారు. 2027 వేసవిలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం టైటిల్‌ను ‘వారణాసి’ (Varanasi)గా ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో రాముడి పాత్రలో సైతం మహేష్ నటించారు. ఆ పాత్రలో నవరసాలు పలికించారని.. ఈ చిత్రంలో కొత్త హేష్‌ను చూడబోతున్నారని వెల్లడించారు.

ఇదొక యాక్షన్‌ అడ్వెంచర్‌ మూవీ అని రాజమౌళి తెలిపారు. వాస్తవానికి తానెప్పుడైనా సినిమాను ప్రారంభించడానికి ముందు ప్రెస్‌మీట్ పెట్టి దానికి సంబంధించిన విశేషాలు చెబుతుంటానని.. కానీ కొన్నింటికి చెప్పలేదన్నారు. ఆ కథకు ఉన్న ప్రాధాన్యతను బట్టి చెప్పాలా? వద్దా? అని డిసైడ్ చేస్తానన్నారు. ‘బాహుబలి’ (Bahubali)కి ముందు ఏమీ చెప్పలేదు. అలాగే ఈ మూవీ గురించి అలా మాటల్లో చెప్పలేమని.. అందుకనే ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా వెల్లడించారు. ఈ సినిమాపై ప్రేక్షకుడి అంచనాలను అందుకోవడంతో పాటు కథావస్తువును కూడా తెలియజేయాలనే ఉద్దేశంతోనే ఒక మాట కూడ చెప్పకుండా వీడియో చేశామన్నారు. ఈ చిత్రాన్ని అసలైన ఐమ్యాక్స్ ఫార్మాట్‌లో రూపొందిస్తున్నట్టు వెల్లడించారు. తాము విడుదల చేసే వీడియో చూసి.. ప్రేక్షకులు థ్రిల్ ఫీలవ్వాలని అనుకున్నామని తెలిపారు.

మహేష్ పాత్ర గురించి కానీ.. కష్టం గురించి కానీ మాట్లాడనని.. ఆయన వ్యక్తిత్వం గురించే మాట్లాడతానని రాజమౌళి వెల్లడించారు. ఇక మహేష్ గురించి రాజమౌళి చెప్పిన సీక్రెట్ ఏంటంటే.. మహేష్ షూటింగ్ స్పాట్‌లో అడుగు పెడితే సెల్‌ఫోన్ టచ్ చేయరట. ఫోన్‌ను కారులోనే పడేసి షూటింగ్‌కు వెళతారట. ఎన్ని గంటలైనా కూడా సెల్‌ఫోన్ జోలికే వెళ్లరట. తాను కూడా మహేష్‌లా ఉండటానికి యత్నిస్తానని వెల్లడించారు. సినిమా ప్రారంభానికి ముందు మహేష్‌కు రాముడి గెటప్‌ వేసి.. ఫోటో షూట్ చేసినట్టుగా వెల్లడించారు. దానికి సంబంధించి 60 రోజులు షూట్ చేశామని.. ఆ సమయంలో మహేష్ ఫోటోను తన ఫోన్ వాల్‌పేపర్‌గా పెట్టుకున్నానని రాజమౌళి వెల్లడించారు. కానీ ఎవరైనా చూస్తే లీక్ చేస్తారని తీసేసినట్టుగా తెలిపారు. రాముడి పాత్రలో మహేష్ అద్భుతంగా నటించినట్టుగా వెల్లడించారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
November 16, 2025 4:09 AM