Prabhas: మూడో సినిమాను పట్టాలెక్కించనున్న ప్రభాస్..
ఈ ఏడాది నుంచి కనీసం ఏడాదికి రెండు సినిమాలనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నాడట. దీనికోసం ఆలస్యం చేయకుండా నచ్చిన కథలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడట.
గతంలో ప్రభాస్ ఒక సినిమా పూర్తయ్యాక మాత్రమే మరో సినిమాను పట్టాలెక్కించేవాడు. కానీ ఇటీవలి కాలంలో సీన్ మారింది. ఒకేసారి రెండు, మూడు సినిమాలను లైన్‌లో పెట్టేస్తున్నాడు. ‘ది రాజాసాబ్’ సినిమాతో బిజీగా ఉన్న సమయంలోనే, ‘కల్కి 2898 ఎ.డి’, ‘ఫౌజీ’ సినిమాలను సైతం పట్టాలెక్కించేశాడు. ‘రాజాసాబ్’ డిజాస్టర్ అయినా కూడా ఆయనకు దేశవ్యాప్తంగా బలమైన మార్కెట్ ఉంటడంతో దర్శకులు ఆయన కోసం కథలు సిద్ధం చేస్తున్నారు. ప్రభాస్ కోసం సిద్ధమవుతున్న కథలన్నీ పాన్ ఇండియా రేంజ్‌కి చెందినవి కావడం విశేషం. పైగా అన్నీ కూడా భారీ హంగులతో రూపుదిద్దుకుంటున్నాయి.
అయితే ఇటీవలి కాలంలో ప్రభాస్ ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ ఏడాది నుంచి కనీసం ఏడాదికి రెండు సినిమాలనైనా ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలనేది టార్గెట్‌గా పెట్టుకున్నాడట. దీనికోసం ఆలస్యం చేయకుండా నచ్చిన కథలను పట్టాలెక్కించే పనిలో పడ్డాడట. ప్రస్తుతం ‘ఫౌజీ’, ‘స్పిరిట్’ సినిమాల షూటింగ్‌ను శరవేగంగా కానిచ్చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ప్రస్తుతం ‘కల్కి2’ సినిమానీ పట్టాలెక్కించాలని డిసైడ్ అయినట్టుగా తెలుస్తోంది. ‘కల్కి 2898 ఏడీ’ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ కొట్టింది. దీనికి సీక్వెల్‌గా ‘కల్కి 2’ని తెరకెక్కించనున్నారు.
ఇప్పటికే ఈ చిత్ర దర్శకుడు నాగ్ అశ్విన్ కొంతకాలంగా ఈ సినిమా ప్రి ప్రొడక్షన్ వర్క్‌ని చేస్తున్నారు. ఇంకెప్పుడో కాదు.. ఈ చిత్రం వచ్చే నెలలోనే ప్రారంభం కానుందని టాక్. ఈ సినిమా కోసం ప్రభాస్ కొన్ని రోజులు డేట్స్ కేటాయించినట్టు తెలుస్తోంది. తిరిగి మూడు సినిమాలను షూటింగ్‌ను ప్రభాస్ ముందుకు నడిపిస్తాడన్నమాట. ఇక ‘రాజాసాబ్’ ఫలితాన్ని ఎలాగూ మైండ్‌లో పెట్టుకుంటాడనుకోండి. ‘కల్కి 2’కి అయితే ఢోకా లేదు. ‘స్పిరిట్’ సినిమా కూడా సందీప్ వంగా కాబట్టి వచ్చిన ఇబ్బందేం లేదని టాక్. ‘ఫౌజీ’ కూడా హను రాఘవపూడి జాగ్రత్తగానే తెరకెక్కిస్తున్నారట. మొత్తానికి మూడు సినిమాలకు ఎలాంటి ఢోకా లేదని ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు.