Prabhas Birthday: వెయ్యి కోట్లకు బాటలు వేసిన రాజు.. టాలీవుడ్‌ను గ్లోబల్ మ్యాప్‌లో పెట్టిన డార్లింగ్..
ఆ సినిమా చూసిన వారికెవరికైనా ప్రభాస్ (Prabhas) గురించి పెద్దగా అంచనాలు ఏమీ లేవు. వారసుడే కదా.. నిలదొక్కుకుంటాడో లేదో అనే సందేహం చాలా మందికి కలిగి ఉండొచ్చు.
ఇండస్ట్రీలో తొలిసారి పాన్ ఇండియా (Pan India)కు బాటలు వేసిన హీరో.. తెలుగు సినిమాను రూ.1000 కోట్ల దిశగా పరుగులు తీయించిన హీరో. బాక్సాఫీస్ వసూళ్లను గడగడలాడించిన హీరో.. వారసుడన్న పదం పోయి ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు (Krishnam Raju) అనే ఒక గొప్ప స్థాయికి చేరుకున్న హీరో.. ఆయనే రాజులకే రాజు ప్రభాస్ రాజు. ప్రభాస్ రాజు (Prabhas Raju).. ప్రభాస్ పుట్టినరోజు (Happy Birthday Darling Prabhas) సందర్భంగా PRAjASMEDIA.com అందిస్తున్న ప్రత్యేక కథనం..
ఇండస్ట్రీకి ఎంతోమంది వారసులు వస్తుంటారు.. కానీ నిలదొక్కకునేది మాత్రం కొందరే. ఆ కొందరిలో ప్రభాస్ (Prabhas) కూడా ఒకడు. ఇంతింతై వటుడింతయై అన్నట్టుగా.. కృష్ణంరాజు వారసుడిగా ‘ఈశ్వర్’ (Eswar) చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా చూసిన వారికెవరికైనా ప్రభాస్ (Prabhas) గురించి పెద్దగా అంచనాలు ఏమీ లేవు. వారసుడే కదా.. నిలదొక్కుకుంటాడో లేదో అనే సందేహం చాలా మందికి కలిగి ఉండొచ్చు. కానీ నిలదొక్కుకోవడం మామూలుగా నిలదొక్కుకోలే.. టాలీవుడ్ (Tollywood) నుంచి ఏకంగా పాన్ ఇండియా పైనే పాదం మోపాడు. తన వ్యక్తిగత జీవితాన్ని ‘టచ్ మీ నాట్’ అన్నట్టుగా చాలా ప్రైవేట్‌గా ఉంచుకునే ప్రభాస్‌కు, ఒక్కసారైనా టచ్ చేయాలని, మాట్లాడాలని, ఫోటో తీసుకోవాలని తపించే అభిమానులు (Prabhas Fans) అడుగడుగునా ఉన్నారు. తన అవసరం ఉన్నప్పుడు వెనుకడుగు వేయని నైజం, నటుడిగా ప్రతి ఒక్కరి మనసు గెలుచుకోవడం... ఇవన్నీ ఆయనపై ఇంతటి అభిమానం పెంచుకోవడానికి కారణాలు.
ఆ సినిమాతో ప్రభాస్ పని అయిపోయిందనుకున్నారు..
ఈ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ (Most Eligible Bachelor Prabhas)కి లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పుకోవాలి. ప్రభాస్ అయితే ‘ఏక్ నిరంజన్’ (Ek Niranjan)లా ఉన్నా.. అభిమానులు మాత్రం ఆయనకు పెళ్లి చేసి, ఊహాత్మక ఫోటోలను సోషల్ మీడియా (Social Media)లో పంచుకుంటూ తమ ‘డార్లింగ్’ (Darling) పై ఉన్న ప్రేమను చాటుకుంటున్నారు. ‘ఈశ్వర్’ తర్వాత చేసిన ‘రాఘవేంద్ర’ (Raghavendra) దెబ్బ కొట్టడంతో అంతా ప్రభాస్ పని అయిపోయిందనుకున్నారు. కానీ మూడో చిత్రం ‘వర్షం’ (Varsham Movie)లో ప్రేక్షకులను తడిపి ముద్దచేసి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఆ తరువాత ‘ఛత్రపతి’ (Chatrapathi)తో మరో బ్లాక్ బస్టర్.. ‘బిల్లా’ (Billa) అంటూ శాసించాడు.. ఆపై ‘మిస్టర్ ఫర్‌ఫెక్ట్’ (Mr Perfect) అని కూడా అనిపించుకున్నాడీ మిర్చిలాంటి కుర్రాడు. 2015లో ‘బాహుబలి’ (Bahubali)తో హిస్టరీ క్రియేట్ చేశాడు.
ప్రభాస్ కెరీర్‌లో ఫ్లాపులు లేవా?
పాన్ ఇండియాకు ఈ సినిమాతోనే నిచ్చెన వేశాడు. తెలుగు సినిమాను జాతీయ స్థాయిలో సగర్వంగా నిలబెట్టాడు. పాన్ ఇండియా శకాన్ని తెలుగులో ఆరంభించింది కూడా ప్రభాసే అనడంలో సందేహం లేదు. అందుకే అన్నది సూర్యుడు లోకానికి వెలుగు అయితే.. ప్రభాస్ ఇండస్ట్రీకి వెలుగు అని. చివరకు ‘కన్నప్ప’ (Kannappa) చిత్రంలో కేమియో చేసి ఆ సినిమాను నిలబెట్టిన ఘనత కూడా ప్రభాస్‌దే. ప్రభాస్ కెరీర్‌లో ఫ్లాపులు లేవా? అంటే ఎందుకు లేవు? వరుసబెట్టి ఫ్లాపులిచ్చాడు. అయితేనేం.. ఫ్యాన్స్ ఇది కాకుంటే మరొకటి అన్నట్టుగా ఉన్నారే కానీ తమ రాజులకే రాజు ప్రభాస్ రాజును వదిలిందే లేదు. ప్రభాస్ తల్లిదండ్రులు ఎంత పుణ్యం చేసుకుని ఉంటారో.. కొన్ని కోట్ల గుండెల్లో కొలువయ్యే అదృష్టవంతుడిని కన్నారు. ఏ క్షణాన ప్రభాస్ (వెలుగు) అని పేరు పెట్టారో కానీ నిజంగానే ఇండస్ట్రీకి వెలుగయ్యాడు.
ఆ విషయంలోనూ తొలి హీరో ప్రభాసే..
ఎన్ని హిట్స్ కొట్టినా తన సన్నిహితుల దగ్గర ప్రభాస్ కించిత్తు గర్వం కూడా ప్రదర్శించినట్టుగా ఎప్పుడూ అనిపించదు. చిన్న పిల్లాడిలా ఫ్రెండ్స్ దగ్గర అల్లరి చేస్తూ స్నేహాన్ని పంచే మనస్తత్వం ఆయనది. ప్రభాస్ ఆ మధ్యకాలంలో పాన్ ఇండియాను ‘సలార్’, ‘కల్కి’ వంటి చిత్రాలతో గడగడలాడించాడు. ఇన్ని పాన్ ఇండియా చిత్రాల్లో నటించి వాటిని సక్సెస్ బాట పట్టించిన తొలి హీరో కూడా ప్రభాసే. ఇన్ని ఘనతలు ఉన్నా కూడా తన వ్యక్తిత్వం ముందు అవన్నీ దిగదుడుపే. ఇక ఇప్పుడు ‘రాజాసాబ్’, ‘స్పిరిట్’, ‘ఫౌజి’ వంటి పాన్ ఇండియా చిత్రాలతో బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు సిద్ధమవుతున్నాడు. ఆల్ ది బెస్ట్ అండ్ హ్యపీ బర్త్ డే (Happy Birthday Prabhas) డార్లింగ్..
ప్రజావాణి చీదిరాల