Sai Durga Tej: పవర్ స్టార్మ్ వచ్చేస్తోంది
స్వాగ్, స్టైల్ అన్నీఆయనకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఇక ఇవాళ కూడా ‘ఓజీ డే’ వచ్చేసిందని.. ఈరోజు ప్రీమియర్లతో, పవర్ స్టార్మ్ ప్రారంభమవుతుందని సాయి దుర్గా తేజ్ తెలిపాడు.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రధాన పాత్రలో నటించిన ‘ఓజీ’ (OG) చిత్రం మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఇండియాలోనే కాకుండా అమెరికా (America)లోనూ పవన్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. అమెరికాలోని డల్లాస్‌లోని సినీమార్క్ ఐమాక్స్ థియేటర్ వద్ద పవన్ కల్యాణ్ 25 అడుగుల కటౌట్ లాంచ్ చేసి మరీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. ఇక ఇండియాలోనూ ఏమాత్రం తగ్గేదేలేదన్నట్టుగా ఫ్యాన్స్ (Pawan Fans) హడావుడి చేస్తున్నారు. మేమేమైనా తక్కువ తిన్నామా.. అన్నట్టుగా ఆయన మేనల్లుడు సాయి దుర్గా తేజ్ నిన్నటి నుంచే సినిమా ప్రమోషన్స్‌ను పీక్స్‌కు తీసుకెళుతున్నాడు. సినిమా ట్రైలర్ రివ్యూ (OG Trailer Review) ఇచ్చి మరీ నిన్న సాయి దుర్గా తేజ్ (Sai Durga Tej) హడావుడి చేశాడు. ఇక ఇవాళ మరో ట్వీట్.
నిన్నటికి నిన్న తాము ఇన్నాళ్లుగా మిస్ అవుతున్న బెంగాల్ టైగర్ (Bengal Tiger) ఇప్పుడు వేటకు బయల్దేరిందని ట్విటర్ వేదికగా పేర్కొన్నాడు. ఈ క్రమంలోనే దర్శకుడు సుజీత్ (Director Sujith), మ్యూజిక్ డైరెక్టర్ తమన్ (Music Director Thaman)పై ప్రశంసలు కురిపించాడు. తన మామయ్యను తన హీరో, గురువుగా పేర్కొంటూ ప్రతీ ఫ్రేమ్‌లో అద్భుతంగా కనిపించారని సాయి దుర్గా తేజ్ తెలిపాడు. స్వాగ్, స్టైల్ అన్నీఆయనకు తప్ప మరెవరికీ సాధ్యం కాదని పేర్కొన్నాడు. ఇక ఇవాళ (సెప్టెంబర్ 24) కూడా ‘ఓజీ డే’ వచ్చేసిందని.. ఈరోజు ప్రీమియర్లతో, పవర్ స్టార్మ్ ప్రారంభమవుతుందని సాయి దుర్గా తేజ్ తెలిపాడు. తనకు చాలా ఎగ్జైటింగ్‌గా ఉందని పేర్కొన్నాడు. తన హీరో, గురువు గారికి బ్లాక్ బస్టర్ సక్సెస్ రావాలంటూ సాయి దుర్గాతేజ్ ఆకాంక్షించాడు.
ప్రజావాణి చీదిరాల