Police Complaint: ప్రేమ-పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామా
హారర్ థ్రిల్లర్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జత చేసి మరీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఒక ప్రత్యేక పాత్రలో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది నటిస్తున్నారని.. ఆమె పాత్ర చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు.
వరలక్ష్మి శరత్ కుమార్, నవీన్ చంద్ర ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న చిత్రం ‘పోలీస్ కంప్లైంట్’. సస్పెన్స్ హారర్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ సంజీవ్ మేగోటి తెరకెక్కిస్తున్నారు. 52 మంది ఆర్టిస్టులతో ఈ చిత్రం రూపొందుతోంది. బాలకృష్ణ మహారాణా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ తాజాగా విడుదలైంది.
ఈ టీజర్ రిలీజ్ ఈవెంట్‌లో సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. ప్రేమ, పగ, తప్పు–ఒప్పు, మంచి–చెడు మధ్య హైడ్ అండ్ సీక్ డ్రామాగా ఈ చిత్రం రూపొందుతున్నట్టు వెల్లడించారు. హారర్ థ్రిల్లర్‌కు ఎంటర్‌టైన్‌మెంట్‌ను జత చేసి మరీ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలిపారు. ఒక ప్రత్యేక పాత్రలో కన్నడ స్టార్ హీరోయిన్ రాగిణి ద్వివేది నటిస్తున్నారని.. ఆమె పాత్ర చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుందన్నారు. ఉత్కంఠభరితమైన స్క్రీన్‌ప్లేతో సాగే ఈ చిత్రంలో కృష్ణసాయి, బేబీ తనస్వి భిన్న పాత్రల్లో మెప్పిస్తారని సంజీవ్ పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, మలయాళం కన్నడ భాషల్లో రూపొందిస్తున్నట్టు వెల్లడించారు.
వరలక్ష్మి శరత్ కుమార్ మాట్లాడుతూ.. సంజీవ్ చెప్పిన సబ్జెక్టు తనకు ఎంతగానో నచ్చడంతో ఈ చిత్రాన్ని చేసినట్టు వెల్లడించారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు ఫుల్‌గా కామెడీ చేశానని.. సినిమా బాగా వచ్చిందని తెలిపారు. ఈ చిత్రం ప్రతి ఒక్కరికి నచ్చుతుందని వరలక్ష్మి తెలిపారు. ఈ చిత్రంలో ఆదిత్య ఓం విలన్ పాత్రలో నటించారు. రవిశంకర్, పృథ్వి, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, శరత్ లోహితశ్వ, జెమినీ సురేష్, దిల్ రమేష్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్, హీరో కృష్ణసాయి, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణమూర్తి, అడివి సాయి కిరణ్, రావుల వెంకటేశ్వర రావు తదితరులు హాజరయ్యారు.
ప్రజావాణి చీదిరాల