Entertainment Breaking News

‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘పోలీస్ కంప్లైంట్’

ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ జానర్స్‌ టైం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ‘పోలీస్ కంప్లైంట్’ అనే చిత్రం రూపొందుతోంది.

‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్‌తో ‘పోలీస్ కంప్లైంట్’

ప్రస్తుతం హారర్ థ్రిల్లర్ జానర్స్‌ టైం నడుస్తోంది. ఈ క్రమంలోనే ఎంఎస్‌కే ప్రమిద శ్రీ ఫిలిమ్స్ బ్యానర్‌పై బాలకృష్ణ మహారాణా నిర్మాణంలో, క్రియేటివ్ డైరెక్టర్ సంజీవ్ మేగోటి దర్శకత్వంలో ‘పోలీస్ కంప్లైంట్’ అనే చిత్రం రూపొందుతోంది. ఈ హారర్-యాక్షన్ థ్రిల్లర్ మూవీ జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్‌తో పాటు రెండు ప్రత్యేక గీతాలను మేకర్స్ విడుదల చేశారు. అలాగే సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ జయంతిని పురస్కరించుకుని కేక్ కట్ చేసి ఘనంగా వేడుకలు నిర్వహించారు.

సూపర్ స్టార్ కృష్ణ నటించిన పలు చిత్రాల టైటిల్స్‌ను గుర్తు చేసుకుంటూ రూపొందించిన ఈ సినిమాలోని ప్రత్యేక గీతాన్ని కృష్ణ అభిమానులతో విడుదల చేయించారు. ఈ పాటలో కృష్ణ వీరాభిమాని, నటుడు కృష్ణసాయి, ప్రీతి సుందర్ కనిపించారు. అలాగే కృతి వర్మ స్పెషల్ అప్పియరెన్స్‌లో నటించిన “నువ్వట్టా సూత్తా ఉంటే” అనే మరో గీతాన్ని తెలంగాణ డీఐజీ రమణారెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ డీఐజీ రమణారెడ్డి, నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్, సీనియర్ నిర్మాత ఆర్. సీతారామరాజు, సూపర్ స్టార్ కృష్ణ మేకప్‌మెన్ మాధవరావు, నిర్మాత ఘంటా శ్రీనివాసరావు, డిస్ట్రిబ్యూటర్ నరేంద్ర, పీఆర్ఓ శర్మ, డిస్ట్రిబ్యూటర్ సిరాజ్, ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి, నటులు కృష్ణసాయి, కృతి వర్మ, ప్రీతి సుందర్ తదితరులు పాల్గొన్నారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. సూపర్ స్టార్ కృష్ణ సినిమాల టైటిళ్లతో రూపొందించిన పాట అద్భుతంగా ఉందని.. ఆయన పుట్టినరోజు సందర్భంగా వేడుక నిర్వహించిన చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. తక్కువ బడ్జెట్‌లో అధిక నాణ్యతతో సినిమాలు రూపొందించే దర్శకుడు సంజీవ్ మేగోటి.. ఈ చిత్రంలో తన బహుముఖ ప్రతిభను చాటుకున్నారన్నారు. సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.

డీఐజీ రమణారెడ్డి మాట్లాడుతూ.. ఈ సినిమాలో ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారని... మంచి కాన్సెఫ్టుతో సినిమా రూపొందించిన‌ట్టు తెలుస్తోందన్నారు. ఈ చిత్రం పెద్ద విజయాన్ని అందుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలపిారు. సూపర్ స్టార్ కృష్ణ మేకప్‌మెన్ మాధవరావు మాట్లాడుతూ.. కృష్ణగారు తనతో ఎంతో ఆత్మీయంగా ఉండేవారని. ఆయనపై ప్రత్యేక గీతాన్ని రూపొందించడం అభినందనీయమన్నారు.

హీరో కృష్ణసాయి మాట్లాడుతూ.. ఈ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉందని.. దర్శకుడు సినిమాను అద్భుతంగా తెరకెక్కించారన్నారు. నా అభిమాన నటుడు సూపర్ స్టార్ కృష్ణగారి పుట్టినరోజు సందర్భంగా ఆయన సినిమాలను గుర్తు చేసే పాటలో నటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.

దర్శకుడు సంజీవ్ మేగోటి మాట్లాడుతూ.. 52 మంది సీనియర్ ఆర్టిస్టులతో కేవలం 45 రోజుల్లో ఈ సినిమాను పూర్తి చేశామని తెలిపారు. ‘చైన్ రియాక్షన్ ఆఫ్ కర్మ’ అనే వైవిధ్యమైన కాన్సెప్ట్ చుట్టూ కథ తిరుగుతుందని.. ఇది హారర్ థ్రిల్లర్ అంశాలతో కూడిన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్ అని పేర్కొన్నారు. అప్ప‌ట్లో సూపర్ స్టార్ కృష్ణగారితో సినిమా చేసే అవకాశం తనకు వచ్చిందని.. తాను చేసిన సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ను ఒకే టేక్‌లో చెప్పిన గొప్ప నటుడని కొనియాడారు.

నటి కృతి వర్మ మాట్లాడుతూ.. తనకుకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దర్శకుడికి ధన్యవాదాలు తెలిపారు. సినిమా చాలా బాగా వచ్చిందని... ప్రతి ఒక్కరూ సినిమా చూడాలన్నారు. నటి ప్రీతి సుందర్ మాట్లాడుతూ.. తొమ్మిదేళ్లుగా నటిగా పలు ప్రాజెక్టుల్లో పనిచేశానని.. ఈ చిత్రంలో ప్రత్యేక గీతంలో అవకాశం ఇచ్చిన దర్శకుడికి కృతజ్ఞతలు తెలిపారు. సూపర్ స్టార్ కృష్ణగారిపై రూపొందించిన పాటలో భాగమవడం చాలా సంతోషంగా ఉందన్నారు. హారర్, యాక్షన్, కామెడీ, రొమాన్స్, థ్రిల్లర్ అంశాల సమ్మేళనంగా రూపొందిన ‘పోలీస్ కంప్లైంట్’ చిత్రం జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, ప్రత్యేక గీతాలు సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తిని మరింత పెంచుతున్నాయన్నారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
June 1, 2026 11:51 AM