Entertainment Breaking News

ప్రభాస్ ‘ఫౌజి’ నుంచి ఫోటో లీక్.. మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

‘ఫౌజి’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటంతో ఈ సినిమా ‘రాజాసాబ్’ను మించి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది.

ప్రభాస్ ‘ఫౌజి’ నుంచి ఫోటో లీక్.. మేకర్స్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభాస్ (Prabhas) ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం ‘రాజాసాబ్ (Rajasaab)’. ఇది చేస్తూనే ప్రభాస్ ‘ఫౌజీ’ (Fauji)ని లైన్‌లో పెట్టేశాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘ఫౌజి’ టైటిల్ చాలా క్రేజీగా ఉండటంతో ఈ సినిమా ‘రాజాసాబ్’ను మించి అంచనాలను క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి ఒక లీక్డ్ ఫోటో (Leaked Photo) బయటకు రావడంతో బీభత్సంగా వైరల్ చేసేశారు. ఈ విషయం మేకర్స్ దృష్టికి వెళ్లడంతో స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇలా ఫోటోలను కానీ.. వీడియోలను కానీ లీక్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని మేకర్స్ వెల్లడించారు.

ప్రభాస్ ‘ఫౌజీ’ అప్‌డేట్ కోసం అభిమానులు (Prabhas Fans) ఎంతగానో ఎదురు చూస్తున్నారో తెలుసని మేకర్స్ పేర్కొన్నారు. చిత్రీకరణ సమయంలో సెట్స్ నుంచి ఓ ఫోటో బయటకు వచ్చినట్టుగా తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు తాము నిరంతరం కృషి చేస్తున్నామని.. ఎంతగానో శ్రమిస్తున్నామని తెలిపారు. ఇలాంటి లీక్స్ తమ టీమ్ నైతికతను దెబ్బతీస్తున్నాయని మేకర్స్ పేర్కొన్నారు. ఎవరైనా ఇక మీదట అనధికారికంగా సినిమా ఫోటోలను కానీ.. వీడియోలను కానీ షేర్ చేస్తే వారి ఖాతాలను తొలగించడమే కాకుండా సైబర్ క్రైమ్ కింద కేసులు నమోదు చేసి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని నిర్మాణ సంస్థ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

ఇక లీక్డ్ ఫోటోలో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో అలరిస్తున్నాడు. దీంతో ఫ్యాన్స్ దీనిని బాగా వైరల్ చేసేశారు. ఇక ‘ఫౌజీ’ విషయానికొస్తే.. ఇంతకు ముందెన్నడూ రాని విభిన్నమైన కథతో పీరియాడికల్‌ యాక్షన్‌ డ్రామాగా రూపొందుతున్నట్టు సమాచారం. భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఇమాన్వీ (Imanvi) కథానాయికగా నటిస్తోంది. ప్రభాస్ ఓ సైనికుడిగా కనిపించనుండటం ఇదే తొలిసారి కావడం కూడా అంచనాలకు రెక్కలు కట్టేశాయి. 1940వ దశకంలో అంటే స్వాతంత్ర్యానికి పూర్వం.. మాతృభూమిపై నివసించే ప్రజానీకానికి న్యాయాన్ని అందించడానికి ఓ యోధుడు చేసే పోరాటంగా ఈ మూవీ తెరకెక్కుతున్నట్టు సమాచారం.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 20, 2025 6:17 AM