Entertainment

Pawan Kalyan: పవన్ నెక్ట్స్ మూవీ.. లోకేష్‌తోనా? ప్రశాంత్ నీల్‌తోనా?

ఒకవేళ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాలు చేయాలనుకుంటే ఆయన కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరితో చేస్తారనేదే ఆసక్తికరం. ఒకవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ..

Pawan Kalyan: పవన్ నెక్ట్స్ మూవీ.. లోకేష్‌తోనా? ప్రశాంత్ నీల్‌తోనా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ఈ ఏడాది ‘హరి హర వీరమల్లు’ (Hari Hara Veeramallu), ‘ఓజీ’ (OG) చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ‘వీరమల్లు’ ఆశించిన ఫలితాన్నివ్వకున్నా కూడా ‘ఓజీ’ మాత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. ఇక వచ్చే ఏడాది ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ (Ustad Bhagatsingh)గా పవన్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈలోపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్‌తో పాటు ప్రమోషన్స్ పూర్తి చేస్తారు. అయితే ‘ఉస్తాద్ భగత్‌సింగ్‌కు అయితే పవన్ గుమ్మడికాయ కొట్టేశారు. ఇక నెక్ట్సేంటి? వెంటనే మరో సినిమాను లైన్‌లో పెడతారా? లేదంటే కొంతకాలం పాటు రాజకీయాలకే సమయం కేటాయిస్తారా? అనేది తెలియాల్సి ఉంది. మరో విషయం ఏంటంటే.. చాతుర్మాసం వచ్చేస్తోంది. ఈ సమయంలో పవన్ చాతుర్మాస దీక్ష (Pawan Chaturmasa Deeksha) తీసుకుంటారు. మరి ఈ ఏడాది తీసుకుంటారా.. లేదా? అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సినిమాలు చేయాలనుకుంటే ఆయన కోసం కథలు సిద్ధంగా ఉన్నాయి. ఎవరితో చేస్తారనేదే ఆసక్తికరం. ఒకవైపు ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌ (KVN Productions) ఆయనతో ఓ ప్రాజెక్ట్‌ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఈ సినిమాను లోకేశ్‌ కనగరాజ్ (Lokesh Kangaraj), హెచ్‌.వినోద్‌ (H Vinod) వంటి దర్శకుల్లో ఒకరు తెరకెక్కించనున్నారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం కేవీఎన్‌ ప్రొడక్షన్స్‌పైనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) - బాబీ (Director Bobby) కాంబోలో సినిమా రూపొందుతోంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ప్రశాంత్ నీల్ (Prashant Neel).. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కోసం కథ సిద్ధం చేశారన్న టాక్ నడుస్తోంది. హోంబలే ఫిల్మ్స్ (Hombale Films) ఈ చిత్రాన్ని రూపొందించనుందట. మొత్తానికి పవన్ కోసం కథలైతే సిద్ధంగానే ఉన్నాయి కానీ పవనే సిద్ధంగా ఉన్నారో లేదో తెలియడం లేదు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 19, 2025 12:18 PM