Pawan-Neel: ప్రశాంత్ నీల్‌తో పవన్ సినిమా.. ఫ్యాన్స్ సిందేయాల్సిందే..!
‘ఓజీ’కైనా రిలీజ్‌కు ముందు నుంచి హడావుడి చేశారు కానీ పవన్-నీల్ కాంబో కానీ సెట్ అయ్యిందంటే.. భూమ్మీద నిలవరేమో.. సీడెడ్ - నైజాం - ఆంధ్రా సిందు తొక్కుతారేమో..

ఎవరి ఊహలకూ.. అంచనాలకు అందకుండా సినిమా తీయగలిగే సత్తా ఉన్న ఒకరిద్దరు దర్శకుల్లో ప్రశాంత్ నీల్ ఒకరు. ‘కేజీఎఫ్’తో ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా ఈయన పేరు మారుమోగింది. కథకు కథ.. భారీతనానికి భారీతనం ఏది తగ్గకుండా సినిమా తీసే సత్తా ఉన్న దర్శకుడు. పార్ట్ 1 ఎంత గొప్పగా ఆడించగలరో.. అంతకు మించే పార్ట్ 2ను ఆడించిగల డైనమిక్ డైరెక్టర్.. మరి అంత గొప్ప డైరెక్టర్ ఎన్టీఆర్‌తో సినిమా తీస్తూనే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కోసం కథ సిద్ధం చేస్తున్నారని టాక్.
పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan).. ప్రశాంత్ నీల్ (Prashanth Neel).. ఆ పేర్లలోనే ఏదో మ్యాజిక్ ఉంది కదా. వీరిద్దరూ కాంబోలో సినిమా వస్తే ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పాలా? సీను సిరిగి.. సీటులెక్కి సీటి కొట్టేలా ఉంటుందేమో.. అసలు ఈ న్యూస్ నిజమేనా? అనే సందేహం కూడా వస్తోంది కదా.. నిప్పు లేనిదే పొగ రాదంటారుగా.. దాదాపుగా నిజమేనని టాక్. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ (Hombale Films) నిర్మించనుందని ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే పవన్ ఫ్యాన్స్ ఆనందానికి అవధులుండవేమో.. ఇప్పటికే ‘ఓజీ’ (OG) ఇచ్చిన కిక్‌తో పవన్ ఫ్యాన్స్ (Pawan Kalyan Fans) అంతా రచ్చ లేపుతున్నారు. ‘ఓజీ’కైనా రిలీజ్‌కు ముందు నుంచి హడావుడి చేశారు. పవన్-నీల్ కాంబో కానీ సెట్ అయ్యిందంటే.. భూమ్మీద నిలవరేమో.. సీడెడ్ - నైజాం - ఆంధ్రా సిందు తొక్కుతారేమో.. అసలు నిజమో కాదో కూడా తెలియక ముందే కథ జానర్ ఏంటి? ఒక్క పార్టేనా? లేదంటే రెండు పార్టులా? అన్న చర్చ మొదలైపోయింది.
ఒకప్పుడు రాజమౌళి (Rajamouli) ‘బాహుబలి’ (Bahubali) చిత్రాన్ని తీసి సెకండ్ పార్ట్ కోసం బాహుబలిని కట్టప్ప (Kattappa) ఎందుకు చంపాడనే ప్రశ్నను వదిలారు. ఆ సమయంలో దీనికి సంబంధించిన చాలా కథనాలు వచ్చాయి. అవన్నీ నిజమయ్యాయి కూడా. కానీ ప్రశాంత్ నీల్ ‘కేజీఎఫ్’ (KGF)ను తీస్తే పార్ట్ 2ను ఊహించడం చాలా కష్టమైందనే చెప్పాలి. ఒకరకంగా చెప్పాలంటే ఎవరి అంచనాలకూ అందలేదు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ (NTR)తో సినిమా తీస్తున్నా కూడా ఎపిక్ యాక్షన్ డ్రామా (Epic Action Drama), ‘డ్రాగన్’ (Dragon) అని తప్ప మిగిలిన విషయాల గురించి కొంచెం కూడా క్లూ లేదు. ఈ సినిమా ఎంత గ్రాండియర్‌గా ఉంటుందో.. కథ ఎలా ఉంటుందో చూడాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. దీని తర్వాత ప్రశాంత్ నీల్.. అల్లు అర్జున్ (Allu Arjun)తో సినిమాను మొదలు పెడతారని టాక్. మరి పవన్‌తో ఎప్పుడు చేస్తారో చూడాలి.
ప్రజావాణి చీదిరాల