Entertainment

Pawan Kalyan: అబ్బాయికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బాబాయ్.. బోనస్‌గా

నేడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే తన కుమారుడి పేరిట అన్నదానం చేశారు.

Pawan Kalyan: అబ్బాయికి బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన బాబాయ్.. బోనస్‌గా

నేడు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు. ఆయనకు అభిమానులు, సెలబ్రిటీలు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి అయితే తన కుమారుడి పేరిట అన్నదానం చేశారు. ఇక ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. రామ్ చరణ్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అద్భుతమైన నటన.. అదిరిపోయే డ్యాన్స్ స్టైల్, అన్నింటికంటే మించిన సక్సెస్.. ఎంతో ఒదిగి ఉండే స్వభావంతో రామ్ చరణ్ కోట్లాది మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తూనే ఉన్నాడని పవన్ పేర్కొన్నారు. అలాగే రామ్ చరణ్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘పెద్ది’ సినిమా ఏప్రిల్ 30న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే బోనస్‌గా ‘పెద్ది’ ఘన విజయం సాధించాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు.

 

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 30, 2026 8:59 AM