Biggboss9: కెప్టెన్సీ కోల్పోయిన పవన్.. రీతూని రాధిక అక్క అంటూ..
బిగ్‌బాస్ 9 ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో చూస్తే చాలా మందికి చాలా సంతోషంగా అనిపించవచ్చు. ఎందుకంటే.. కెప్టెన్సీ టాస్క్ సరిగా జరగలేదని అందరి భావన. అది నిజం కూడా.

బిగ్‌బాస్ 9 (Biggboss 9) ప్రోమో వచ్చేసింది. ఈ ప్రోమో (Biggboss Promo) చూస్తే చాలా మందికి చాలా సంతోషంగా అనిపించవచ్చు. ఎందుకంటే.. కెప్టెన్సీ టాస్క్ సరిగా జరగలేదని అందరి భావన. అది నిజం కూడా. టాస్క్ చూసినా అంతకు ముందు డెమాన్ పవన్ (Demon Pawan)కు రీతూ చౌదరి (Rithu Chowdary) ‘నువ్వు కెప్టెన్’ కావాలని కోరడం.. ఆ తరువాత కెప్టెన్సీ టాస్క్ కోసం పవన్‌ని సజెస్ట్ చేయడం..వంటివి చేసింది. ఆ తరువాత తనే సంచాలక్ కావడంతో నైస్‌గా అందరినీ తప్పించేసి డెమాన్‌కు కెప్టెన్సీని కట్టబెట్టింది. దీనిపై పెద్ద ఎత్తున నెట్టింట దుమారం రేగింది. సోషల్ మీడియా (Social Media), యూట్యూబ్ ఛానల్స్ (Youtube Channels) అన్నీ దీనిని హైలైట్ చేశాయి.
మొత్తానికి పెద్ద ఎత్తున రచ్చ కావడంతో బిగ్‌బాస్ టీం (Biggboss Team) ఏమనుకుందో ఏమో కానీ రీతూకి హోస్ట్ నాగార్జున (Host Nagarjuna)తో ఇవ్వాల్సిన క్లాస్ గట్టిగానే ఇప్పించేసి డెమాన్ పవన్ నుంచి కెప్టెన్సీ బ్యాడ్జ్‌ను తీసుసేకుంది. ఇవన్నీ పక్కనబెడితే రీతూ మాత్రం రాధిక (Radhika) అక్కగా మారిపోయింది. ఆమెను రాధిక అక్క అంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. వచ్చే వారం రీతూ కరెక్ట్‌గా ఉండలేదు అంటే మాత్రం బిగ్‌బాస్ హౌస్ (Biggboss House) నుంచి బయటకు వచ్చేయడం పక్కా. ఇప్పటికే కావల్సినంత నెగిటివిటీని మూట గట్టుకుంది. మాట్లాడే పద్ధతి, నడుచుకునే విధానం ఏదీ సరిగా లేదంటూ ప్రేక్షకులు రచ్చ చేస్తున్నారు. ఇక ఈవారం బిగ్‌బాస్ హౌస్ నుంచి మర్యాద మనీష్ (Maryada Manish) బయటకు వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.