Pawan Kalyan: 24 గంటల్లోనే 29.6 మిలియన్ల వ్యూస్.. దూసుకెళుతున్న ‘దేఖ్‌లేంగే సాలా’
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత ఇంత కాలానికి అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan), హరీష్ శంకర్ (Harish Shankar) కాంబో కోసం ఎప్పటి నుంచో అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 'గబ్బర్ సింగ్' తర్వాత ఇంత కాలానికి అభిమానుల ఎదురు చూపులు ఫలించాయి. పవన్ కళ్యాణ్, దర్శకుడు హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagatsingh) రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్‌ను సైతం మేకర్స్ ప్రారంభించారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ‘దేఖ్‌లేంగే సాలా’ విడుదలైంది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ (Devisri Prasad) సంగీతం ఈ పాటను ఓ స్థాయికి తీసుకెళ్లగా.. పవర్ స్టార్ తన డ్యాన్స్‌తో మెప్పించారు.
చాలా స్టైలిష్‌గా పవర్ స్టార్ వేసిన స్టెప్స్ చూస్తుంటే పవన్ ఈజ్ బ్యాక్ అనిపిస్తోంది. కేవలం 24 గంటల్లోనే 29.6 మిలియన్లకు పైగా వీక్షణలతో ఈ సాంగ్ రికార్డ్స్‌ను బద్దలు కొడుతోంది. ‘దేఖ్‌లేంగే సాలా’ పాట ఇంతటి విజయం సాధించడానికి దర్శకుడు హరీష్ శంకర్ సైతం ప్రధాన కారణం అనడంలో సందేహమే లేదు. హరీష్ శంకర్ రూపొందించిన ‘గబ్బర్‌సింగ్’ సాంగ్స్ సైతం సెన్సేషన్ హిట్ సాధించాయి. ఇప్పుడు కూడా ఈ చిత్రంలోని పాటలు అంతటి ఘన విజయాన్ని సాధిస్తాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ‘గబ్బర్‌సింగ్’ తరహా సాంగ్స్.. డ్యాన్స్ తిరిగి ఈ చిత్రంలో వస్తాయనడంలో సందేహమే లేదు. ఈ చిత్రంలో శ్రీలీల (Sreeleela), రాశిఖన్నా (Rashi Khanna) హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల