Pawan Kalyan: అబ్బాయి కారణంగా ఇబ్బంది పడుతున్న బాబాయ్..!
సంక్రాంతి సందడి ముగిశాక చెప్పుకోదగిన చిత్రాలేమీ థియేటర్లకు రాలేదు. దీంతో ప్రేక్షకుల ఫోకస్ మొత్తం సమ్మర్‌పైనే ఉంది. సమ్మర్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నాని ‘ప్యారడైజ్’ చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి.
సంక్రాంతి సందడి ముగిశాక చెప్పుకోదగిన చిత్రాలేమీ థియేటర్లకు రాలేదు. దీంతో ప్రేక్షకుల ఫోకస్ మొత్తం సమ్మర్‌పైనే ఉంది. సమ్మర్‌లో రామ్ చరణ్ ‘పెద్ది’, నాని ‘ప్యారడైజ్’ చిత్రాలు సందడి చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ చిత్రాలు రిలీజ్ డేట్స్ అయితే ప్రకటించుకున్నాయి కానీ పోస్ట్‌పోన్ అయ్యే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ప్యారడైజ్ మార్చి 26, ఆ మరుసటి రోజు అంటే మార్చి 27న పెద్ది సినిమాలు విడుదల కానున్నాయి. విడుదల తేదీలను మేకర్స్ అధికారికంగా ప్రకటించడంతో ప్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.
అదేంటంటే.. ముందుగా ప్రకటించిన డేట్స్ ప్రకారం మార్చిలో రిలీజ్ చేయట్లేదని రెండు సినిమాల డిస్ట్రిబ్యూటర్లకు సమాచారం వెళ్లిందట. అయితే దీనిపై మేకర్స్ ఏమీ స్పందించడం లేదు. రెండూ పెద్ద హీరోల సినిమాలు, రెండూ భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నవే కావడంతో బాక్సాఫీస్ వద్ద క్లాష్ వద్దని మేకర్స్ వెనక్కి తగ్గుతున్నారట. ఈ తెలుగు సినిమాలకు తోడు కేజీఎఫ్ స్టార్ యశ్ నటించిన ‘టాక్సిక్’, రణ్‌వీర్ సింగ్ నటించిన ‘ధురంధర్ 2’ కూడా మార్చిలోనే రానున్నాయి. ఇదంతా ఎందుకొచ్చిన తలనొప్పి అనుకున్నారో ఏమో కానీ సమ్మర్ బరి నుంచి తప్పుకుందామని పై రెండు చిత్రాల మేకర్స్ భావిస్తున్నట్టుగా టాక్ నడుస్తోంది.
ఇక పెద్ది, ప్యారడైజ్ అనుకున్న తేదీలకు వస్తాయో లేదో క్లారిటీ లేకపోవడంతో ఇతర ప్రాజెక్టులపై కూడా దీని ఎఫెక్ట్ పడుతోంది. ముఖ్యంగా పవన్ కల్యాణ్ ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ఫై ఈ రెండు సినిమాల ఎఫెక్ట్ పడే అవకాశం ఉందంటున్నారు. వాస్తవానికి ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ అయితే పూర్తి కాలేదు. కాబట్టి మేకర్స్ రిలీజ్ డేటును సైతం ప్రకటించలేదు. దీనికి కారణం పెద్దియేనని టాక్. పెద్ది విడుదల తేదీ విషయంలో వచ్చిన కన్ఫ్యూజన్ అని అంటున్నారు. ఎందుకంటే.. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ ప్రొడక్షన్ సంస్థే ‘పెద్ది’కి కూడా కొంతమేర ఫైనాన్స్ చేసిందట. అందుకే ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ విడుదల విషయంలో నిర్ణయం తీసుకోలేకపోతోందట. మొత్తానికి అబ్బాయ్ కారణంగా బాబాయి అయితే ఇబ్బంది పడుతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తోంది.