Entertainment

Big Surprise: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్.. ఫ్యాన్స్‌కు పండగే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇది ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. అదేంటంటే.. ‘ఓజీ’ నుంచి అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. ఇది సర్‌ప్రైజ్ అనుకుంటున్నారా? కాదండోయ్..

Big Surprise: ఊహించని సర్‌ప్రైజ్ ఇచ్చిన పవన్.. ఫ్యాన్స్‌కు పండగే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) నుంచి ఊహించని సర్‌ప్రైజ్ వచ్చింది. నిజం చెప్పాలంటే.. ఇది ఫ్యాన్స్‌కు పండగేనని చెప్పాలి. అదేంటంటే.. ‘ఓజీ’ (OG) నుంచి అప్‌డేట్ ఒకటి వచ్చేసింది. ఇది సర్‌ప్రైజ్ అనుకుంటున్నారా? కాదండోయ్.. స్వయంగా పవన్ (Pawan) పాట పాడటం సర్‌ప్రైజ్. వాస్తవానికి ఆయన ఇప్పటికే కొన్ని చిత్రాల్లో పాడారు కానీ ఏమాత్రం క్లూ లేకుండా సడెన్‌గా తను పాడిన పాటను అప్‌డేట్‌గా వదలడం ఆసక్తికరమే కదా. 'వాషి యో వాషి' అంటూ పవన్ స్వయంగా ‘ఓజీ’ చిత్రంలో ఆలపించారు. గత సినిమాలతో పోలిస్తే ఈ సినిమాలో పవన్ పాటకు చాలా తేడా ఉంది. ఎందుకంటే ఒక నిజమైన సింగర్ మాదిరిగానే గొంతు సవరించుకున్నారు.

మొత్తానికి ఈ సర్‌ప్రైజ్ అయితే పవన్ అభిమానుల (Pawan Fans)ను మెస్మరైజ్ చేసిందనే చెప్పాలి. ఇప్పటికే సోషల్ మీడియా 'వాషి యో వాషి' చేసిన మాయలో మునిగి తేలుతోంది. విడుదలైన క్షణాల్లోనే పెద్ద ఎత్తున వైరల్ అవడమే కాదు.. లక్షల్లో వ్యూస్ సంపాదించి ట్రెండింగ్ దిశగా దూసుకెళుతోంది. ఫ్యాన్స్ అయితే దీనిని మెగా విందుగా చెబుతున్నారు. మొత్తానికి ఈ చిత్రం ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తోంది. ఇప్పటికే రెండు పాటలను విడుదల చేసిన మేకర్స్.. ఇప్పుడు మూడో పాటతో పెద్ద సర్‌ప్రైజే ఇచ్చారు. తమన్ (Thaman) సంగీతం పాటకు చాలా హైప్ ఇచ్చింది. ఈ చిత్రంలో ఇమ్రాన్ హష్మీ (Imran Hashmi), ప్రియాంక అరుళ్ మోహన్ (Priyanka Arul Mohan), ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రియా రెడ్డి (Sriya Reddy) తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
September 19, 2025 4:02 PM