Entertainment

Tovino Thamos - Kayadu Lohar: ‘పళ్లిచట్టంబి’ ఒక బ్యూటిఫుల్, ఎమోషనల్ ఫిలిం

హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. దర్శకుడు డిజో తనకు చాలాకాలంగా తెలుసని.. తామిద్దరం ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నామని.. ఈ క్రమంలోనే కొన్ని కథలు డిస్కస్ చేసుకున్నట్టుగా తెలిపారు.

Tovino Thamos - Kayadu Lohar: ‘పళ్లిచట్టంబి’ ఒక బ్యూటిఫుల్, ఎమోషనల్ ఫిలిం

మలయాళ స్టార్ హీరో టొవినో థామస్ నటిస్తున్న భారీ బడ్జెట్ మూవీ "పళ్లిచట్టంబి". డిజో జోస్ ఆంటోనీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని వరల్డ్ వైడ్ ఫిలింస్, సి క్యూబ్ బ్రోస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్స్‌పై నౌఫల్, బ్రిజీష్, చాణక్, చైతన్య, చరణ్ నిర్మించారు. కయదు లోహర్ హీరోయిన్‌గా నటించింది. ఈ పాన్ ఇండియా చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ఈక్రమంలోనే సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా హీరో టొవినో థామస్, హీరోయిన్ కయదు లోహర్ మీడియాతో ముచ్చటించారు.

ఈ సందర్భంగా హీరో టొవినో థామస్ మాట్లాడుతూ.. దర్శకుడు డిజో తనకు చాలాకాలంగా తెలుసని.. తామిద్దరం ఒక ప్రాజెక్ట్ చేయాలనుకున్నామని.. ఈ క్రమంలోనే కొన్ని కథలు డిస్కస్ చేసుకున్నట్టుగా తెలిపారు. అయితే అప్పటికే తనకు ఉన్న కమిట్‌మెంట్స్ కారణంగా ఆయనతో సినిమాకు వెంటనే ఓకే చెప్పలేదన్నారు. డిజో పళ్లిచట్టంబి కథ చెప్పినప్పుడు చాలా ఎగ్జైటింగ్ గా అనిపించిందని... అలా ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయినట్టు వెల్లడించారు. ఆ తర్వాత తాను కమిట్ అయిన మూవీస్ అన్నీ ఫినిష్ చేసుకునే లోపు డిజో కూడా జనగణమణ సినిమాతో పాటు మరో మూవీ రూపొందించారని టొవినో తెలిపారు. ఆ తర్వాత ఈ సినిమా వర్క్స్ ప్రారంభించామన్నారు. ఈ కథ ప్రకారం హీరో బలంగా ఉండాలి కాబట్టి తాను వెయిట్ పెరిగానని టొవినో తెలిపారు. హెయిర్ స్టైల్, మీస కట్టుతో ఒక మంచి లుక్ లోకి మారినట్టుగా వెల్లడించారు.

 

తనకు ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమని.. షూటింగ్ గ్యాప్‌లో వెకేషన్స్‌కు వెళ్తుంటానని టొవినో తెలిపారు. తన ఫ్యామిలీతో వెకేషన్స్‌లో సమయం గడపడం తనకు ఇష్టమని.. ఏవో హెక్టిక్ షెడ్యూల్స్ పెట్టుకుని బ్యాక్ టు బ్యాక్ వర్క్ చేయడం తనకు ఇష్టం ఉండదని వెల్లడించారు. తెలుగులో ఇప్పటిదాకా చాలా మూవీస్‌కు డిస్కషన్స్ జరిగాయి కానీ ఏదీ కన్ఫర్మ్ కాలేదని వెల్లడించారు. మలయాళంలో ప్రస్తుతం తాను స్ట్రాంగ్ పొజిషన్‌లో ఉన్నానని.. అక్కడ మూవీస్ వదిలి మరో భాషకు వస్తే తనను నమ్ముకుని ప్రాజెక్ట్స్ చేసే వాళ్లు నష్టపోతారని టొవినో తెలిపారు. పళ్లిచట్టంబి సినిమా 50వ దశకంలో కేరళలో జరిగిన ఇన్సిడెంట్స్ స్ఫూర్తిగా ఫిక్షనల్‌గా సాగే మూవీ అని వెల్లడించారు. అప్పుడు సామాజికంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాటినే మూవీలో చూపించామన్నారు.

హీరోయిన్ కయదు లోహర్ మాట్లాడుతూ.. డ్రాగన్ మూవీ కంటే ముందు ఓకే అయిన చిత్రమిదని తెలిపింది. తాను నటించిన మలయాళ మూవీ పాథోన్‌పథం నూట్టండు చూసి దర్శకుడు డిజో ఈ మూవీ కోసం అప్రోచ్ అయ్యారని.. ఈ కథ విన్నాక ఇది తన కెరీర్‌లో ఇదొక స్పెషల్ మూవీ అవుతుందని అనిపించడంతో ఓకే చేశానని వెల్లడించింది. ఇప్పటిదాకా తాను ఏ మూవీలో నటించని తరహా పాత్ర ఈ సినిమాలో చేశానని.. రెబెకా అనే పాత్రలో కనిపిస్తానని తెలిపింది. ఈ పాత్ర ఇంటెలెక్చువల్, రూటెడ్‌గా.. తన పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని పేర్కొంది. ఈ సినిమా తనను నాయికగా మరింత మంచి పొజిషన్ కు తీసుకెళ్తుందనే నమ్మకం ఉందని కయదు తెలిపింది. నేను బయటకు మోడరన్ అమ్మాయిలా కనిపిస్తా కానీ తాను వాస్తవానికి రూరల్ అమ్మాయినేనని వెల్లడించింది.

తనకు తెలియని భాషల్లో సినిమాలు చేస్తున్నప్పుడు ఆ మూవీ కోసం తప్పకుండా వర్క్ షాప్స్ చేస్తానని కయదు తెలిపింది. భాష తెలిసిన వారి సహాయం తీసుకుంటానని వెల్లడించింది. కనీసం ఐదు నుంచి పది రోజులు వర్క్ షాప్స్ చేసి, స్క్రిప్ట్ అర్థం చేసుకున్న మీదటే సెట్స్‌లోకి వెళ్తానని కయదు తెలిపింది. ఈ సినిమా కోసం కూడా అలాంటి వర్క్ షాప్స్ చేశానని వెల్లడించింది. రెండు రకాల లుక్స్‌లో తాను ఈ చిత్రంలో కనిపిస్తానని కయదు తెలిపింది. తాను ఈ మూవీలో ఎలా కనిపించాలి అనే విషయంలో దర్శకుడు డిజో పూర్తి స్పష్టతతో ఉన్నారని వెల్లడించింది. తాను ఎవరితో కలిసి నటించినా ధైర్యంగా నటిస్తా కానీ టొవినోతో కలిసి నటించినప్పుడు ఎందుకో భయమేసిందని.. ఆయన పర్ఫార్మెన్స్‌లో తనకంటే ముందుంటారని తెలిపింది. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని.. టొవినోను చూసి ఇన్‌స్పైర్ అయి నటించానని కయదు తెలిపింది. పళ్లిచట్టంబి ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ ఫిలిం అని.. ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ కలిసి చూడొచ్చని పేర్కొంది.

 

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
April 1, 2026 2:33 PM