Entertainment Breaking News

Golla Ramavaa: 25న తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ‘గొల్ల రామవ్వ’

పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్యరూపమైన ‘గొల్ల రామవ్వ’ వెండితెరపై వెలుగులీననుంది. ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను..

Golla Ramavaa: 25న తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే ‘గొల్ల రామవ్వ’

పీవీ నరసింహారావు రాసిన తెలంగాణ సాయుధ పోరాట గాథకు దృశ్యరూపమైన ‘గొల్ల రామవ్వ’ వెండితెరపై వెలుగులీననుంది. ముళ్లపూడి వరా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ రోమాంచిత వీరగాథను సుచేత డ్రీమ్ వర్క్స్ ప్రొడక్షన్ - వర్మ డ్రీమ్ క్రియేషన్స్ పతాకాలపై రామ్ విశ్వాస్ హనూర్కర్ - రాఘవేంద్రవర్మ (బుజ్జి) సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి అజహర్ షేక్ కార్యనిర్వాహక నిర్మాతగా వ్యవహరించడమే కాకుండా సాహిత్యాన్నిసైతం సమకూర్చారు. ఈ చిత్ర టైటిల్ రోల్‌ను తాళ్లూరి రామేశ్వరి పోషించారు. ఈ చిత్రం తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ట్రైలర్ ఆవిష్కరణ వేడుకలో అతిథులు పేర్కొన్నారు.

ఈ నెల 25న ‘గొల్ల రామవ్వ’ చిత్రం ఈటీవీ విన్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పీవీ నరసింహారావు తనయుడు పీవీ ప్రభాకరరావు, కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, ప్రముఖ గీత రచయితలు కాసర్ల శ్యామ్, మౌనశ్రీ మల్లిక్, ప్రముఖ నటులు రాజీవ్ కనకాల, "రజాకార్" దర్శకులు యాటా సత్యనారాయణ, సీనియర్ దర్శకులు ఉదయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. చిత్ర దర్శక, నిర్మాతలపై అతిథులు ప్రశంసలు కురిపించారు. ఈ సందర్భంగా పీవీ ప్రభాకరరావు మాట్లాడుతూ.. తన తండ్రి రాసిన గొప్ప కథల్లో ఒకటైన గొల్ల రామవ్వను చాలా గొప్పగా తెరకెక్కించారన్నారు. ఈ వేడుకలో పెద్ద సంఖ్యలో చిత్రబృందం పాల్గొనడంతో పాటు ఈ సినిమాకు పని చేసే అదృష్టం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు.

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
January 22, 2026 2:05 PM