Pawan Kalyan OG: ‘ఓజీ’ టికెట్ వేలం.. ఎంతకు అమ్ముడైందో తెలిస్తే..
తొలి షో టికెట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. టికెట్ ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు పవన్ అభిమానులు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ (Powerstar Pawan Kalyan) ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘ఓజీ’(OG). భారీ అంచనాలతో సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ప్రస్తుతం పవన్ మేనియాలో రెండు తెలుగు రాష్ట్రాలు మునిగి తేలుతున్నాయి. ఈ క్రమంలోనే ‘ఓజీ’ సినిమాను తొలి రోజే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఉన్నారు. ఈ క్రమంలోనే తొలి షో టికెట్ కోసం నానా తంటాలు పడుతున్నారు. టికెట్ ఎంత రేటైనా కొనుగోలు చేసేందుకు పవన్ అభిమానులు వెనుకాడటం లేదు. ఇప్పటికే ఆన్‌లైన్‌లో టికెట్ల విక్రయాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోతున్నాయి.
ఇలా టికెట్స్ ఆన్‌లైన్‌లో వెలియడమే ఆలస్యం అలా మాయమవుతున్నాయి. ఇక కొన్ని థియేటర్లైతే ఏకంగా టికెట్ వేలంపాటను నిర్వహిస్తున్నాయి. తాజాగా యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లోని శ్రీనివాసా థియేటర్‌లో ‘ఓజీ’ బెనిఫిట్ షో టికెట్ వేలం పాటను పవన్ కల్యాణ్ అభిమానులు నిర్వహించారు. ఈ వేలం పాట కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ‘జబర్దస్త్’ ఫేమ్ వినోదిని హాజరయ్యారు. ఈ వేలం పాట కార్యక్రమానికి పవన్ అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఇక ఇక్కడి టికెట్ వేలం పాటలో ఎంతకు అమ్ముడయ్యిందో తెలిస్తే షాక్ అవుతారు. లక్కారం గ్రామానికి చెందిన అభిమాని ఆముదాల పరమేశ్ ఏకంగా రూ.1,29,999కి టికెట్‌ను దక్కించుకున్నారు. ఈ డబ్బును ఏం చేస్తారనే కదా మీ సందేహం? వేలం పాట ద్వారా వచ్చిన డబ్బును జనసేన పార్టీకి విరాళంగా ఇవ్వనున్నట్లు పార్టీకి విరాళంగా అందజేస్తారట. మొత్తానికి పవన్ ఫ్యాన్స్ అదుర్స్ కదా...