NTR: ఎన్టీఆర్ లేటెస్ట్ అప్‌డేట్.. ఇక దున్నేస్తాడట..
ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్స్ (NTR Look) వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) చాలా స్లిమ్ అయిపోయి కనిపిస్తున్నాడు. ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు.
జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR).. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel)తో సినిమా చేస్తున్నారన్న మాటే కానీ ఈ సినిమా నుంచి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ కూడా బయటకు రాలేదు. అన్నీ సోషల్ మీడియా (Social Media) ప్రచారాలే తప్ప అధికారిక ప్రకటనలంటూ ఏమీ రావడం లేదు. ఈ సినిమాకు ‘డ్రాగన్’ (Dragon) అనే టైటిల్ ప్రచారంలో ఉంది కానీ దీనికి సంబంధించి కూడా అధికారిక ప్రకటన లేదు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభమై శరవేగంగా జరుపుకుంటోంది. ఈ సినిమాను పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ (Mytri Movie Makers) నిర్మాత రవిశంకర్ (Producer Ravishankar) నిర్మిస్తున్నారు. ఆయనే ఈ సినిమాను భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు.
అంతకు మించి సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్ లేదు. సినిమాపై అంచనాలు అయితే ఆకాశాన్నంటుతున్నాయి. దీనికి కారణం ప్రశాంత్ నీల్ అనడంలో సందేహమే లేదు. ఈ సినిమాకు సంబంధించి ఎన్టీఆర్ లుక్స్ (NTR Look) వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ (NTR) చాలా స్లిమ్ అయిపోయి కనిపిస్తున్నాడు. ఇటీవల ఓ మూవీ ఈవెంట్‌లో ఆయన సందడి చేశారు. అలాగే ఇటీవల ఎన్టీఆర్ తన బావమరిది నితిన్ నార్నె (Nitin Narne) వివాహంలో సైతం ఎన్టీఆర్ కనిపించారు. ఆయనలో చాలా మార్పు కనిపిస్తోంది. ఈ మార్పంతా ప్రశాంత్ నీల్ సినిమా కోసమేనని టాక్ నడుస్తోంది. ఈ సినిమా గురించి మరో ఆసక్తికర విషయం కూడా కనిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ అనుకున్న లుక్ బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా రీ షూటింగ్ ప్రారంరభమవుతుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్టీఆర్ లుక్ చూస్తుంటే డైరెక్టర్ ప్రశాంత్ అనుకున్న లుక్ వచ్చేసినట్లేనని తెలుస్తోంది. తాజాగా ఎన్టీఆర్ ఎయిర్‌పోర్టులో నుంచి బయటకు వస్తున్న వీడియోలు సైతం వైరల్‌గా మారడంతో ప్రశాంత్ నీల్ చిత్రంలో ఎన్టీఆర్ లుక్ అదేనన్న టాక్ నడుస్తోంది. బ్లూ జీన్స్, క్యాజువల్ చెక్ షర్ట్, పైన బ్లాక్ కలర్ జాకెట్‌తో ఎన్టీఆర్ చూడటానికి గతంతో పోలిస్తే కొద్దిగా బరువు పెరిగినా కూడా ఇంకా సన్నగా మెరుపుతీగలా.. స్టైలిష్ లుక్‌తో దర్శనమిస్తున్నారు. అంతే సోషల్ మీడియాలో తన తాజా లుక్‌తో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. ఇక ప్రశాంత్ నీల్ చిత్రంతో దున్నేయడం ఖాయమట.
ప్రజావాణి చీదిరాల