Entertainment

Rajamouli-Mahesh: ఇక తగ్గేదేలే.. సౌండ్ యూనివర్స్‌కు వినిపించాలే..

మొత్తానికి తాజాగా సినిమా గురించి ఒక అప్‌డేట్ అయితే ప్రపంచాన్ని మెస్మరైజ్ చేయనుంది. అదేంటంటే.. నవవంబర్‌లో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ (SSMB 29 Glimpse) రానుందని తెలుస్తోంది.

Rajamouli-Mahesh: ఇక తగ్గేదేలే.. సౌండ్ యూనివర్స్‌కు వినిపించాలే..

దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli) - సూపర్ స్టార్ మహేష్ బాబు (Superstar Mahesh Babu) కాంబో గురించి తెలుసుకోవాలని ప్రపంచం మొత్తం ఆరాటపడుతోంది. కానీ రాజమౌళి మాత్రం ఎలాంటి అప్‌‌డేట్ లేకుండా సైలెంట్‌గా తన పని తాను చేసుకుబోతున్నారు. ‘బాహుబలి (Bahubali), ఆర్ఆర్ఆర్ (RRR)’ చిత్రాలతో పాన్ ఇండియా (Pan India) రేంజ్‌లో సత్తా చాటడంతో ప్రస్తుతం రాజమౌళి తీయబోయే సినిమా ఎలా ఉంటుందన్న ఆసక్తి పెరిగింది. కానీ రాజమౌళి ఒక్కటంటే ఒక్క అప్‌డేట్ అయినా వదిలితేనా? దీంతో జనాలే వాళ్లకు తోచినట్టుగా సినిమా కథను ఊహించుకుంటున్నారు.

మొత్తానికి తాజాగా సినిమా గురించి ఒక అప్‌డేట్ అయితే ప్రపంచాన్ని మెస్మరైజ్ చేయనుంది. అదేంటంటే.. నవవంబర్‌లో ఈ సినిమా నుంచి ఒక గ్లింప్స్ (SSMB 29 Glimpse) రానుందని తెలుస్తోంది. ఈ క్రమంలోనే నవంబర్ 11 లేదంటే 15 తేదీల్లో సినిమా టైటిల్‌ (SSMB 29 Title)తో పాటు గ్లింప్స్ కూడా విడుల కానుందని టాక్. దీనిని ఏదో సింపుల్‌గా కాకుండా.. ఇప్పటి వరకూ సినిమాకు సంబంధించి ఎలాంటి ఈవెంట్ చేయలేదు కాబట్టి ఈ ఈవెంట్‌ను మాత్రం సౌండ్ ప్రపంచానికి గట్టిగా వినిపించనున్నారట. ఈ ఈవెంట్ మరెక్కడో కాదు.. హైదరాబాద్‌లోనే నిర్వహించనున్నారని తెలుస్తోంది. ఇంతకాలం వెయిట్ చేసిన రాజమౌళి.. ఇక తగ్గేదేలేదట. నవంబర్‌లో యూనివర్స్‌కు వినిపించేలా సౌండ్ చేస్తారట.

అంతేకాకుండా ఈ ఈవెంట్‌ను మహేష్ అభిమానుల (Mahesh Fans) సమక్షంలో నిర్వహించనున్నారని టాక్ నడుస్తోంది. దీనికోసం ఇప్పటికే ప్లాన్ చేయడం ప్రారంభించారని తెలుస్తోంది. మహేష్‌తో రాజమౌళి పాన్ ఇండియా కాకుండా పాన్ వరల్డ్ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఈ సినిమాలో ప్రియాంక చోప్రా (Priyanka Chopra) ముఖ్య పాత్రలోనూ.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ (Prudhviraj Sukumaran) విలన్‌గానూ నటిస్తున్నారు. మొత్తానికి ఈ సినిమా ఎలాంటి బ్లాస్ట్ సృష్టిస్తుందోనన్నఆసక్తి అయితే అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు జనాల్లోనూ ఉంది. మొత్తానికి ఎస్ఎస్ఎంబీ 29 నుంచి ఏదో ఒక అప్‌డేట్ అయితే త్వరలోనే రానుంది. మహేష్ కూడా ఈ సినిమా కోసం చాలా మారాడు. లాంగ్ హెయిర‌్‌తో హాలీవుడ్ హీరోలా మారిపోయాడు. ఈ చిత్రం ప్రేక్షకులకు ఐ ఫీస్ట్ అనడంలో సందేహమే లేదు.

ప్రజావాణి చీదిరాల

 

Prajavani Cheedirala
Prajavani Cheedirala
October 22, 2025 2:40 AM