Pawan Kalyan OG: ‘ఓజీ’ నుంచి ఒకటి కాదు.. రెండు సర్‌ప్రైజ్‌లు..
‘ఓజీ’ చిత్రం అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ ఏదో ఒక అప్‌డేట్‌ను విడుదల చేస్తూనే ఉంది.

‘ఓజీ’ చిత్రం అప్‌డేట్స్ ఎప్పుడు వస్తాయా? అని ఎదురు చూస్తున్న అభిమానులను నిరుత్సాహపరచకుండా ఎప్పటికప్పుడు చిత్ర యూనిట్ ఏదో ఒక అప్‌డేట్‌ను విడుదల చేస్తూనే ఉంది. ఓజెస్ గంభీరగా పవన్‌కల్యాణ్ నటిస్తుండగా.. ఆయన జోడికి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ ఇచ్చారు. అంతేకాదు.. మరో సర్‌ప్రైజ్ కూడా ప్రకటించారు. అదేంటో కూడా తెలుసుకుందాం..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawar Star Pawan Kalyan) అభిమానులు ఎందుకోగానీ.. ‘హరి హర వీరమల్లు (Hari Hara Veeramallu)’ కంటే ఎక్కువగా ‘ఓజీ (OG)’ కోసమే చూస్తున్నారు. ‘వీరమల్లు’కు సంబంధించి ఏ ప్రెస్‌మీట్ జరిగినా.. లేదంటే.. ఓజీకి పని చేసే ఏ టెక్నీషియన్ లేదంటే నటుడు కనిపించినా అభిమానులు అడిగే తొలి ప్రశ్న.. ‘ఓజీ’కి సంబంధించినదే అయి ఉంటుంది. అంత క్రేజ్ ఉంది ప్రేక్షకుల్లో. సుజీత్ (Director Sujith) దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలిసారిగా ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ అవతార్‌లో కనిపించనున్నారు. ఇప్పటి వరకూ పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించింది లేకపోవడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. పైగా పవన్ ఇలాంటి మూవీలో నటిస్తే చూడాలని ఎప్పటి నుంచో అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాను అభిమానుల కోసమే సుజీత్ రూపొందిస్తున్నట్టుగా ఉంది.
బ్లూ కలర్ శారీలో దేవకన్యలా..
ఓ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు పవన్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రంలో ‘గ్యాంగ్ లీడర్ (Gang Leader)’ బ్యూటీ ప్రియాంక అరుల్ మోహన్ (Priyanka Arul Mohan) హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటి వరకూ పవన్ తన పోస్టర్స్‌తో అభిమానులను ఎంటర్‌టైన్ చేస్తే.. ఇప్పుడు ప్రియాంక వంతు. ఈ సినిమా నుంచి ఈ ముద్దుగుమ్మ ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇక ప్రియాంక కణ్మని పాత్రలో మెప్పించనుంది. ప్రియాంకకు సంబంధించి రెండు పోస్టర్‌లను మేకర్స్ విడుదల చేశారు. ఒక పోస్టర్‌లో ఆమె బ్లాక్ శారీలో అందంగా కనిపిస్తుంటే.. మరో పోస్టర్‌లో బ్లూ కలర్ శారీలో దేవకన్యలా కనిపిస్తోంది. ఒక మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు స్మూత్‌నెస్ జోడించేందుకు ప్రియాంకను ఎంచుకున్నట్టుగా ఆ పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. అంతేకాదు.. పోస్టర్స్‌ను బట్టి చూస్తే ఏదో ఫ్లాష్ బ్యాక్ చిత్రీకరణకు సంబంధించినదిగా ఉంది.
సెకండ్ సర్‌ప్రైజ్ ఏంటంటే..
ఈ పోస్టర్‌ను షేర్ చేసిన మేకర్స్.. ‘ప్రతి తుఫాన్‌కు అవసరమైన ప్రశాంతత ప్రియాంక మోహన్’ అని పేర్కొన్నారు. ఒకవైపు ఈ చిత్రాన్నే తెరకెక్కిస్తూనే మరోవైపు ప్రచార కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల ‘ఓజీ’ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ సాంగ్ ‘ఫైర్ స్టార్మ్’కు అద్భుతమైన స్పందన వచ్చింది. అంతా ఓకే కానీ మరో సర్‌ప్రైజ్ ఏంటంటారా? ఇప్పుడు సెకండ్ సాంగ్ వంతు వచ్చేసింది కాబట్టి దాని విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను త్వరలోనే విడుదల చేయనున్నారు. ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్ (Prakash Raj), శ్రియా రెడ్డి (Sriya Reddy) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ ఏడాది సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రజావాణి చీదిరాల