Entertainment

Niharika Konidela-Yadhu Vamsi: మళ్లీ వీళ్లిద్దరూ ‘బరి’లోకి దిగారు..

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డులు సైతం గెలుచుకుని సగర్వంగా నిలిచింది. యధువంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిహారికా కొణిదెల నిర్మించారు. మరోసారి వీళ్లిద్దరూ ‘బరి’లోకి దిగారు.

Niharika Konidela-Yadhu Vamsi: మళ్లీ వీళ్లిద్దరూ ‘బరి’లోకి దిగారు..

‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవార్డులు సైతం గెలుచుకుని సగర్వంగా నిలిచింది. యధువంశీ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని నిహారికా కొణిదెల నిర్మించారు. మరోసారి వీళ్లిద్దరూ ‘బరి’లోకి దిగారు. నిర్మాతగా నిహారిక మంచి సక్సెస్ బాటలో నడుస్తున్నారు. ఈ క్రమంలోనే ఈసారి తన సోదరుడు వరుణ్ తేజ్ కొణిదెల చిత్రాన్ని రూపొందించేందుకు అన్నీ సెట్ చేసుకున్నారు. ఈ చిత్రం నేడు పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముందుగానే ఈ చిత్రానికి టైటిల్ కూడా ప్రకటించారు. ఈ సినిమాకు చిత్ర యూనిట్ ‘బరి’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసింది.

పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ #PEP3 పూజా కార్యక్రమాలతో నేడు ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు కుటుంబమంతా హాజరైంది. అలాగే ముఖ్య అతిథిగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ హాజరై ఈ చిత్రానికి క్లాప్ కొట్టారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన టైటిల్ గ్లింప్స్‌ను పవన్ కల్యాణ్ ఆసక్తిగా తిలకించారు. సినిమా యూనిట్‌కు పవన్ కల్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చిత్రం ఫుట్‌బాల్ నేపథ్యంలో తెరకెక్కనుంది. అనంతరం నిహారిక మాట్లాడుతూ.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే విలేజ్ డ్రామాగా ఈ చిత్రం రూపొందనున్నట్టు వెల్లడించారు. 2027లో ఈ చిత్రం విడుదల కానున్నట్టు వెల్లడించారు.

వరుణ్ తేజ మాట్లాడుతూ.. ఈ సినిమా తనకు చాలా స్పెషల్ అని తెలిపారు. నిహారిక ప్రొడక్షన్‌లో యంగ్ టీమ్‌తో పని చేయడం ఆనందంగా అనిపిస్తోందన్నారు. ‘బరి’ సినిమా చూసి అంతా ఎక్సైట్ అవుతారని తెలిపారు. వచ్చే సంక్రాంతికి ‘బరి’ చిత్రం విడుదల కానుందని వరుణ్ తేజ్ తెలిపారు. నిహారిక, తాను వెళ్లి అడగటంతో పవన్ తన బిజీ షెడ్యూల్‌లో కూడా వచ్చి తామందరికీ ఆశీర్వాదం అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దర్శకుడు యధు వంశీ మాట్లాడుతూ.. ‘బరి’ చిత్రం సంక్రాంతికి ‘కమిటీ కుర్రోళ్లు’ను మించిన సక్సెస్ అందుకుంటుందని తెలిపారు.

ప్రజావాణి చీదిరాల

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 28, 2026 4:32 AM