Entertainment

Niharika Konidela: ‘రాకాస’ థియేటర్‌కు వచ్చిన వాళ్లను నిరాశపర్చదు

మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవలి కాంలో మంచి సక్సెస్ రేటుతో నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు.

Niharika Konidela: ‘రాకాస’ థియేటర్‌కు వచ్చిన వాళ్లను నిరాశపర్చదు

మెగా డాటర్ కొణిదెల నిహారిక ఇటీవలి కాంలో మంచి సక్సెస్ రేటుతో నిర్మాతగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం త‌న పింక్ ఎలిఫెంట్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మాత‌గా ఉమేష్ కుమార్ బ‌న్సాల్‌తో క‌లిసి ‘రాకాస’ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు సంబంధించిన టీజర్ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించారు. మానస శర్మ తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభ‌న్‌, న‌య‌న్ సారిక‌ జంటగా నటించారు. ఈ చిత్రం వేసవి కానుకగా ఏప్రిల్ 3న విడుదల కానుంది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ప్రారంభించింది.

ఈ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. పింక్ ఎలిఫెంట్ నుంచి వచ్చే ప్రతీ కంటెంట్‌ను ఆడియెన్స్ ప్రేమిస్తూ, సపోర్ట్ చేస్తున్నారని పేర్కొన్నారు. ‘రాకాస’ కథ విన్న వెంటనే తనకు నచ్చిందన్నారు. సినిమా ఏదైనా సరే ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్నదే తన నిర్మాణ సంస్థ లక్ష్యమని పేర్కొన్నారు. ‘రాకాస’తో థియేటర్‌కు వచ్చిన వాళ్లను నిరాశపరచబోమని.. వేరే లెవల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామని తెలిపారు. తను రూపొందించిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఎన్నో అవార్డుల్ని అందుకుందని.. అలాగే ‘రాకాస’ను కూడా అంతే ప్రేమతో, ప్యాషన్‌తో నిర్మించానని.. ఇది ఎక్కడి వరకు వెళ్తుందో చూడాలని నిహారిక పేర్కొన్నారు.

సంగీత్ శోభన్ మాట్లాడుతూ .. నిహారిక, మానస వల్లే ‘రాకాస’ ఈ స్థాయికి వచ్చిందని.. వీరి వల్లే తాను ఈ స్థాయిలో నిలబడ్డాననని పేర్కొన్నాడు. ఈ మూవీ కోసం ఆ ఇద్దరూ ఎంతో కష్టపడ్డారని సంగీత్ వెల్లడించాడు. మానస గారు కథ చెప్పిన వెంటనే తనకు చాలా నచ్చిందని.. నిర్మాతగా నిహారిక గారు అని చెప్పడంతో మరింత కాన్ఫిడెన్స్ వచ్చేసిందన్నారు. ‘రాకాస’ అందరినీ నవ్విస్తుందని.. ఇందులో తనది వన్ మాన్ షో ఉంటుందో లేదో కానీ.. మానస శర్మది మాత్రం వన్ ఉమెన్ షో లా ఉంటుందని సంగీత్ తెలిపాడు. ఈ చిత్రం మంచి ఎంటర్‌టైనింగ్‌గా.. చాలా కొత్తగా ఉంటుందని సంగీత్ శోభన్ పేర్కొన్నాడు.

దర్శకురాలు మానస శర్మ మాట్లాడుతూ .. ‘రాకాస’ కోసం చాలా కష్టపడి పని చేశామన్నారు. నిహారిక వల్లే తాను దర్శకురాలిగా మారానని.. ఆమెకి ఎప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. సంగీత్ శోభన్‌ వ్యక్తిగతంగా ఎంతో మంచి వ్యక్తి అని.. సంగీత్‌తో మళ్లీ మళ్లీ పని చేయాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. డైరెక్టర్లందరికీ కూడా డ్రీమ్ యాక్టర్‌గా సంగీత్ నిలుస్తాడన్నారు. ఈ కథను తాను, మహేష్ ఉప్పలతో కలిసి రాశానని.. ఏప్రిల్ 3న మా చిత్రం రాబోతోందని మానస పేర్కొన్నారు. జీ తెలుగు హెడ్ దివ్య మాట్లాడుతూ .. ‘పింక్ ఎలిఫెంట్‌తో కలిసి ‘రాకాస’ని చేయడం ఆనందంగా ఉందని.. నిహారికతో కలిసి పని చేయడం తమకు ఎప్పుడూ సంతోషంగానే ఉంటుందన్నారు. ఏప్రిల్ 3న ఈ సినిమా రాబోతోందన్నారు.

సంగీత దర్శకుడు అనుదీప్ మాట్లాడుతూ ..‘‘రాకాస’ సినిమాలో మూడు పాటలుంటాయని... మూవీ రిలీజ్ తరువాత మరో పాటను విడుదల చేస్తామన్నారు. పాటలన్నీ అద్భుతంగా వచ్చాయని పేర్కొన్నారు. నటుడు గెటప్ శ్రీను మాట్లాడుతూ .. ‘నిహారిక గారితో ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ చేశానని.. ఇప్పుడు‘రాకాస’ చేశానని తెలిపారు. మానస శర్మ తనకొక మంచి పాత్రను రాశారన్నారు. సినిమా అందరినీ ఆకట్టుకుంటుందన్నారు.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
March 2, 2026 5:29 AM