Netflix: హైటెక్‌సిటీలో నెట్‌ఫ్లిక్స్.. ఇప్పుడున్న ఓటీటీ సంస్థల మాటేంటి?
ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ (OTT Flatforms)ల్లో దిగ్గజం అంటే నెట్‌ఫ్లిక్స్ (Netflix) అనే చెప్పాలి. ఈ సంస్థ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది.
ప్రస్తుతం ఓటీటీ ఫ్లాట్‌ఫామ్ (OTT Flatforms)ల్లో దిగ్గజం అంటే నెట్‌ఫ్లిక్స్ (Netflix) అనే చెప్పాలి. ఈ సంస్థ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకునే దిశగా అడుగులు వేస్తోంది. ఆసియా (Asia)లో రెండవ అతిపెద్ద కేంద్రమైన నెట్‌ఫ్లిక్స్ తన సామ్రాజ్యాన్ని భారత్‌లో సైతం విస్తరించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్, ముంబైలలో తన మొట్టమొదటి ప్రధాన కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దీనికోసం హైటెక్ సిటీలోని క్యాపిటల్ ల్యాండ్ ఐటీపీహెచ్ (ITPH) బ్లాక్ ఏ భవనంలో 41,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో తమ కార్యాలయాన్ని నెలకొల్పేందుకు నెట్‌ఫ్లిక్స్ డీల్ ఫిక్స్ చేసుకుంది. ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇదే భవనంలో అంతర్జాతీయ మీడియా దిగ్గజం వార్నర్ బ్రదర్స్ (Warner Bros.) సైతం తమ కార్యాలయాన్ని నిర్వహిస్తోంది.
దక్షిణ భారత మార్కెట్‌పై ఫోకస్ చేసిన నెట్‌ఫ్లిక్స్ తమ సంస్థ కార్యాలయాన్ని హైదరాబాద్‌లో స్థాపించనుంది. ప్రాంతీయ కంటెంట్‌తో పాటు పోస్ట్ ప్రొడక్షన్, టెక్నికల్ ఆపరేషన్స్ వంటి కీలక విభాగాలన్నింటినీ హైదరాబాద్‌లోని కార్యాలయమే నిర్వహించనుంది. ముఖ్యంగా ‘బాహుబలి’ (Bahubali), ‘ఆర్‌ఆర్‌ఆర్’ (RRR) వంటి చిత్రాలతో తెలుగు సినిమా ఖ్యాతి ఖండాంతరాలకు విస్తరించింది. దీంతో తెలుగు సృజనాత్మక రంగంపై నెట్‌ఫ్లిక్స్ మరింత ఫోకస్ పెట్టాలని డిసైడ్ అయ్యింది. అంతేకాకుండా హైదరాబాద్ వచ్చేసి మీడియా, టెక్ రంగాల్లో దూసుకుపోతోంది. ఇక్కడ ఎన్నో ఫిల్మ్ స్టూడియోలతో పాటు వీఎఫ్ఎక్స్ (VFX) సంస్థలు, పోస్ట్ ప్రొడక్షన్ (Post Production) సెంటర్స్ ఉండటంతో హైదరాబాద్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది.
మొత్తానికి నెట్‌ఫ్లిక్స్ (Netflix) రాక అయితే ఫిక్స్. హైదరాబాద్ స్థానం మరింత బలోపేతం కావడం కూడా ఫిక్స్. కానీ ప్రస్తుతమున్న సంస్థల మాటేంటి? నెట్‌ఫ్లిక్స్ స్థానికంగా బలోపేతమైతే ఆహా (Aha) వంటి సంస్థల పరిస్థితేంటి? జనాలు నెట్‌ఫ్లిక్స్‌కు అలవాటు పడిన తరువాత ఇతర ఓటీటీ సంస్థల (OTT Flatforms) కు డిమాండ్ తగ్గిందనే చెప్పాలి. సినిమాలను కూడా ఎక్కువ శాతం నెట్‌ఫ్లిక్సే కొనుగోలు చేస్తోంది. ఏది ఏమైనా వ్యాపార రంగంలో దిగ్గజంగా ఉన్న హైదరాబాద్.. మున్ముందు వినోద రంగం (Entertainment)లోనూ అత్యంత శక్తివంతమైన నగరంగా మారబోతోంది. ఇక నెట్‌ఫ్లిక్స్ సంస్థ తన కార్యకలాపాలను ఎప్పుడు ప్రారంభిస్తుందనే విషయంలో క్లారిటీ అయితే లేదు. డిసెంబర్, జనవరిలో ప్రారంభించే అవకాశం ఉందని అంటున్నారు.
ప్రజావాణి చీదిరాల