Entertainment Breaking News

నందమూరి ఫ్యాన్స్‌కు మోక్షజ్ఞ ఎంట్రీపై గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్

నందమూరి అభిమానులు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అంటూ తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. దర్శకుడిగా ఎందరో పేర్లు వినవచ్చాయి.

నందమూరి ఫ్యాన్స్‌కు మోక్షజ్ఞ ఎంట్రీపై గుడ్ న్యూస్ చెప్పిన నారా రోహిత్

నందమూరి అభిమానులు (Nandamuri Fans) మోక్షజ్ఞ (Mokshagna) ఎంట్రీ కోసం ఎంతలా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. చాలా కాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఫిక్స్ అంటూ తెగ వార్తలు వచ్చేస్తున్నాయి. దర్శకుడిగా ఎందరో పేర్లు వినవచ్చాయి. ఇంతవరకూ ఏదీ ఫిక్స్ కాలేదు. మోక్షజ్ఞ చూస్తేనేమో బాగా స్లిమ్ అయిపోయి సినిమాకు రెడీ అన్నట్టుగా కనిపిస్తున్నాడు. తాజాగా అతని లుక్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయినా సరే మోక్షజ్ఞ ఎంట్రీపై ఎలాంటి క్లారిటీ లేదు. దీనిపై తాజాగా నారా రోహిత్ (Nara Rohith) ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఇండస్ట్రీకి వచ్చేందుకు మోక్షజ్ఞ చాలా ఆసక్తిగా ఉన్నాడని తెలిపాడు.

ఇటీవల తాను మోక్షజ్ఞతో మాట్లాడినప్పుడు కూడా తాను స్క్రిప్ట్ కోసం ఎదురు చూస్తున్నట్టు చెప్పాడని.. ఈ ఏడాది చివరిలో లేదంటే వచ్చే ఏడాది ప్రారంభంలో మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని నారా రోహిత్ తెలిపాడు. సినిమాల కోసమే తన లుక్‌ను సైతం చేంజ్ చేశాడని.. గతంలో కంటే ఇప్పుడు మోక్షజ్ఞ లుక్‌లో చాలా మార్పు వచ్చిందని వెల్లడించాడు. ఫీల్‌గుడ్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు నారా రోహిత్ సిద్ధమవుతున్నాడని.. అలాంటి కథ దొరికితే వచ్చే ఏడాది ఎంట్రీ ఇవ్వడం ఖాయమన్నట్టుగా తెలిపాడు. ఇక బాలకృష్ణతో మల్టీస్టారర్‌పై నారా రోహిత్ మాట్లాడుతూ.. గతంలో స్క్రిప్ట్ రెడీ చేశారని.. లుక్ టెస్ట్ కూడా జరిగిందని తెలిపాడు. కథ కూడా నచ్చిందని కానీ బాలయ్య (Balayya)కు వరుస సినిమాలతో పాటు ఎలక్షన్స్ కూడా ఉండటంతో అది పట్టాలెక్కలేదని నారా రోహిత్ వెల్లడించాడు.

బాలయ్య నటించిన మరో సినిమాలో తాను కేమియో రోల్ చేయాల్సి ఉందని.. కానీ కొన్ని కారణాల వల్ల కుదరలేదని తెలిపాడు. ఆ సినిమా స్థానంలోనే బాలయ్య ‘లెజెండ్’ చేసినట్ట వెల్లడించాడు. భవిష్యత్‌లో బాలయ్యతో కలిసి నటించే అవకాశం వస్తే వదులుకోనని.. ఆ తరుణం కోసమే ఎదురు చూస్తున్నట్టుగా నారా రోహిత్ తెలిపాడు. ఇక రాజకీయాల విషయానికి వస్తే సమయం వచ్చినప్పుడల్లా కార్యకర్తలను కలుస్తున్నట్టు వెల్లడించాడు. ప్రస్తుతం ఆయన నటించిన ‘సుందరకాండ’ విడుదలకు సిద్ధంగా ఉండటంతో ప్రచార కార్యక్రమాల్లోనారా రోహిత్ బిజీ బిజీగా గడిపేస్తున్నాడు. ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Prajavani Cheedirala
Prajavani Cheedirala
August 20, 2025 2:05 PM