Napoleon Returns Glimpse: నువ్వే కదా నీడ పోయిందని కంప్లైంట్ ఇచ్చావ్..
టైటిల్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాంటి ఆసక్తికర టైటిల్‌తో ఆనంద్ రవి హీరోగా.. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నెపోలియన్ రిటర్న్స్’.
టైటిల్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనడంలో సందేహం లేదు. అలాంటి ఆసక్తికర టైటిల్‌తో ఆనంద్ రవి హీరోగా.. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘నెపోలియన్ రిటర్న్స్’. ఆదివారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ (Napoleon Returns Glimpse), టైటిల్ లాంచ్ చేశారు. ఈ చిత్రంతో దివి Divi) హీరోయిన్‌గా నటించింది. గతంలో ‘నెపోలియన్, ప్రతినిధి, కొరమీను’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆనంద్ రవి.. మరోసారి యూనిక్, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించిన ప్రమోషనల్ వీడియో (Napoleon Returns Promotional Video)ను డిఫరెంట్ స్టైల్లో డిజైన్ చేశారు. దీంతో సినిమాపై మంచి క్యూరియాసిటీ క్రియేట్ చేశారు.
గ్లింప్స్ విషయానికి వస్తే.. ఆనంద్ రవి.. జబర్దస్త్ కమెడియన్ ఆటో రామ్ ప్రసాద్ (Auto Ram Prasad).. మరొకరితో కలిసి పోలీస్ స్టేషన్‌కు వెళతాడు. ఒక గేదె సమస్యగా మారిందని పోలీసుతో చెబుతాడు. పోలీస్ ఆఫీసర్‌గా ఉన్న రఘుబాబు (Raghubabu) ఆశ్చర్యపోతారు. రఘుబాబు సహా పోలీసులంతా ఆ గేదె ఆత్మ గురించి మరింత సమాచారం తెలుసుకోవాలనుకుంటారు. ఆ ఇంటికి వెళ్లాక ఒక చిన్నారి పుర్రె కనిపిస్తుంది. మొత్తానికి అది చూశాక ఈ మూవీ ఇంట్రస్టింగ్ హారర్ సస్పెన్స్ అనే భావన కలుగుతుంది. గ్లింప్స్ చివరలో నెపోలియన్ సినిమా రెఫరెన్స్‌ను కూడా చూపించారు. ఓ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ రవితో ‘ఇంతకు ముందే నువ్వే కదా నీడ పోయిందని కంప్లైంట్ ఇచ్చావ్’ అని అడగటంతో నెపోలియ్‌కు రిఫరెన్స్ చూపించినట్టుగా అయ్యింది. ఈ చిత్రంలో ఆటో రామ్ ప్రసాద్, రఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్రవణ్ రాఘవేంద్ర, యాంకర్ రవి (Anchor Ravi) తదితరులు కీలక పాత్రలు పోషించారు.
ప్రజావాణి చీదిరాల