Napoleon Returns: ఇలాంటి కథ మునుపెన్నడూ రాలే..
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ రవి (Anand Ravi) హీరోగా, దర్శకుడిగా మారి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, టైటిల్‌ను నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో విడుదల చేశారు.
ఆచార్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ రవి (Anand Ravi) హీరోగా, దర్శకుడిగా మారి ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్, టైటిల్‌ను నేడు (ఆదివారం) హైదరాబాద్‌లో విడుదల చేశారు. భోగేంద్ర గుప్త నిర్మించిన ఈ చిత్రానికి ‘నెపోలియన్ రిటర్న్స్’ (Napoleon Returns) అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రంలో దివి ప్రధాన పాత్రలో నటించింది. ఈ క్రమంలోనే నిర్వహించిన టైటిల్, గ్లింప్స్ లాంచ్ ఈవెంట్‌కు దర్శకులు వశిష్ట (Director Vasista), సాయి రాజేష్ (Director Sai Rajesh), అనిల్ విశ్వంత్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
హీరో, డైరెక్టర్ ఆనంద్ రవి మాట్లాడుతూ .. ఈ ప్రయాణంలో తనకు గుప్తా ఎంతగానో సహకరించారన్నారు. తాను గతంలో ‘పేరెంట్స్’, ‘ప్రతినిధి’, ‘నెపోలియన్’, ‘కొరమీను’ చిత్రాలతో తాను అందరికీ సుపరిచితుడినేనన్నారు. కానీ ఇప్పటివరకూ సరైన సక్సెస్ కానీ, గుర్తింపు కానీ రాలేదన్నారు. ‘నెపోలియన్ రిటర్న్స్’తో వాటన్నింటినీ తనకు తెచ్చి పెడుతుందన్నారు. తొమ్మిది నెలల పసిపిల్లాడు ఆత్మగా మారే పాయింట్‌తో ఇంత వరకూ ఎక్కడా సినిమా రాలేదన్నారు. దివి మాట్లాడుతూ ..‘నెపోలియన్’ తరువాత ఆనంద్ రవిని కలిశానని.. ‘నెపోలియన్ రిటర్న్స్’ కథ విన్న తర్వాత తనే ఆ సినిమా చేస్తానని చెప్పినట్టు పేర్కొన్నారు.
ఈ ఈవెంట్‌లో వశిష్ట మాట్లాడుతూ .. తాను రవన్న (ఆనంద్ రవి) కోసమే వచ్చానని తెలిపారు. అప్పుడేమో నీడ పోయిందని ‘నెపోలియన్’ తీశాడని.. ఇప్పుడు జంతువుల ఆత్మతో కథ రాశాడన్నారు. అలా రాసుకోవచ్చని తనకు ఇప్పుడే అర్థమైందని వశిష్ట అన్నారు. ఈ మూవీ కథ తనకు తెలుసని.. సినిమా అద్భుతంగా ఉండబోతోందన్నారు. సాయి రాజేష్ మాట్లాడుతూ .. తాను, వశిష్ట, ఆనంద్ రవి మంచి స్నేహితులమని తెలిపారు. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ చాలా బాగుందని.. ఈ మూవీతో ఆనంద్ రవికి పెద్ద విజయం దక్కాలని ఆకాంక్షించారు
అనిల్ విశ్వంత్ మాట్లాడుతూ .. ‘ఆనంద్ రవి తొలి చిత్రానికి తాను పని చేశానని.. ఆయన తనకు గురువు వంటి వారన్నారు. ఆయన రైటింగ్ తనకు చాలా ఇష్టమని.. ఆయన తీసుకునే హుక్ పాయింట్ చాలా బాగుంటుందన్నారు. నిర్మాత భోగేంద్ర గుప్తా మాట్లాడుతూ .. ఆనంద్ ఈ కథ కోసం చాలా కష్టపడ్డారని.. ఏడాదిన్నర కాలం పాటు ప్రీ ప్రొడక్షన్ కోసమే పని చేశారన్నారు. మంచి సబ్జెక్ట్‌తో అందరి ముందుకు రాబోతోన్నామన్నారు. ఈ చిత్రంలో ఆటో రాం ప్రసాద్ (Auto Ram Prasad), యాంకర్ రవి (Anchor Ravi) తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
ప్రజావాణి చీదిరాల